గుండు కొట్టించి.. మూత్రం పోసి..ఓ వ్యక్తిపై హిజ్రాల పైశాచికం
అంతేకాకుండా మూత్రం తాగాలని ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నాడు
హిజ్రాలు అంటే.. కేవలం డబ్బులు తీసుకునేవారు మాత్రమే కాదు.. వారిలోనూ మానవత్వం ఉందని అనేక సందర్భాల్లో నిరూపిం చారు. అలాంటివారు తాజాగా ఓ ఘటనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా తమ ఇంట్లో పని మానేసి..వేరే హిజ్రా ఇంట్లో పనిచేస్తున్నాడనే అక్కసుతో ఒక వ్యక్తికి గుండు కొట్టించి.. అతనిపై మూత్రం పోసి.. జేబులో ఉన్న జీతం సొమ్మును కూడా లాగేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ నివ్వెరపోయేలా చేసింది.
విషయంలోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లాలోని ఓ ప్రాంతంలో ఐదుగురు హిజ్రాలు కలిసి ఒకే రూమ్‌లో ఉంటున్నారు. వీరికి వండి పెట్టేందుకు, వారి దుస్తులు ఉతికేందుకు రాఫికుల్ అనే వ్యక్తిని నియమించుకున్నారు. కొన్నాళ్లుగా అతను అక్కడే పనిచేస్తున్నాడు. అయితే.. వీరు నెలకు రూ.8000 మాత్రమే ఇస్తున్నారు. ఈ క్రమంలో మరో ప్రాంతంలోని హిజ్రాలు ఇతనని తమ ఇంట్లో పనికి వస్తే.. 10000 ఇస్తామని ఆశచూపారు. దీంతో 2000 ఎక్కువగా వస్తాయని భావించిన రాఫికుల్ అక్కడ చేరాడు.
అయితే.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఐదుగురు హిజ్రాలు.. అతను ప్రయాణించే మార్గంలో కాపు కాచి.. అడ్డుకున్నారు. అప్పటికే పక్కా ప్లాన్ ప్రకారం తెచ్చుకున్న బ్లేడ్‌తో అతనికి గుండు గీశారు. అనంతరం... అతనిపై మూత్రం పోశారు.
అంతేకాకుండా బాధితుని వద్ద నుంచి రూ.10 వేలు దోచుకెళ్లారు. దీంతో చేసేదేమీ లేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తన ఫిర్యాదులో ఆయా విషయాలను వెల్లడించాడు. అంతేకాకుండా మూత్రం తాగాలని ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.