హెచ్1-బీ వీసాదారులకు బిగ్ అలర్ట్... మార్చి 22న కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్!

మార్చి 22న డొనాల్డ్ ట్రంప్ ఓ కీలకమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను విడుదల చేయబోతున్నారని అంటున్నారు.;

Update: 2025-03-18 03:50 GMT

డొనాల్డ్ ట్రంప్ 2.0లో ఇమ్మిగ్రేషన్స్ లో పలు మార్పులకు శ్రీకారం చుడుతోన్న సంగతి తెలిసిందే! ఈ సమయంలో కొత్త ప్రయాణ నిషేధ జాబితాను ఆవిష్కరించడానికి ముహూర్తం ఫిక్స్ చేశారని.. మార్చి 22న ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ విడుదల సన్నాహాలు చేస్తోందని కథనాలొస్తున్నాయి. ఇది హెచ్1బీ వీసాదారులపై గణనీయమైన ప్రభావాన్ని చూపవచ్చని అంటున్నారు.

అవును... మార్చి 22న డొనాల్డ్ ట్రంప్ ఓ కీలకమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను విడుదల చేయబోతున్నారని అంటున్నారు. దీంతో.. సమయం చాలా తక్కువగా ఉండటంతో చాలా మంది వలసదారులు ప్రీమియ ప్రాసెసింగ్ కోసం డబ్బు ఖర్చు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందా.. లేక, రాబోయే ఆంక్షలు ఈ ఖర్చు వృథాగా చేస్తాయా అని ఆలోచిస్తున్నారని అంటున్నారు.

తాజా సమాచారం ప్రకారం... ట్రంప్ కొత్త ప్రయాణ నిషేధంలో చేర్చబడిన 43 దేశాలను మూడు కేటగిరీలుగా విభజించనున్నారు. ఇందులో భాగంగా... ఎరువు, ఆరెంజ్, పసుపు అనే మూడు వేర్వేరు స్థాయిలలో వచ్చే దేశాలకు అమెరికాలోకి ఎంట్రీపై పాక్షిక.. లేదా, పూర్తి సస్పెన్షన్లను ఏర్పాటు చేసే ముసాయిదా ప్రతిపాదనను వైట్ హౌస్ పరిశీలిస్తోందని అంటున్నారు.

ఇందులో.. "ఎరుపు" దేశాల జాబితాలో అమెరికా ప్రవేశం నిషేధించబడిన జాతీయులు ఉన్నారు. వీరిలో... ఆఫ్ఘనిస్తాన్, క్యూబా, భూటాన్, ఇరాన్, ఉత్తర కొరియా, లిబియా, సూడాన్, సోమాలియా, వెనిజులా, సిరియా, యెమెన్ దేశాలు ఉన్నాయి!

ఇక "ఆరెంజ్" జాబితా విషయానికొస్తే.. ఈ దేశాల పౌరులు యునైటెడ్ స్టేట్స్ లో ప్రవేశం పొందే ముందు తప్పనిసరిగా ఇన్-పర్సన్ వీసా ఇంటర్వూలలో సరిగ్గా పరిశీలించబడి, పరీక్షించబడాలి! ఈ జాబితాలో ఉన్న దేశాలు... బెలారస్, హైతీ, ఎరిట్రియా, లావోస్, పాకిస్థాన్, మయన్మార్, సియొర్రా లియోన్, రష్యా, తుర్క్మెనిస్తాన్, దక్షిణ సూడాన్ ఉన్నాయి.

ఇక "పసుపు" జాబితా విషయానికొస్తే... ఇందులో కొన్ని భద్రతా లోపాలు ఉన్న దేశాలను గుర్తిస్తుందని చెబుతున్నారు. అందువల్ల ఈ దేశాలవారు 60 రోజుల వ్యవధిలోపు ప్రభుత్వ డిమాండ్లకు అనుగుణంగా మార్పులు చేయవలసి ఉంటుంది. లేనిపక్షంలో.. వీరిని ఎరుపు, ఆరెంజ్ జాబితాలో చేర్చే అవకాశం ఉంది.

ఈ జాబితాలో ఉన్న దేశాలు... అంగోలా, ఆంటిగ్వా, బుర్కినా ఫాసో, బెనిన్, కామెరూన్, కంబోడియా, చాడ్, కేప్ వెర్డే, కాంగో రిపబ్లిక్, డొమినికా, కాంగో డెమొక్రాటిక రిపబ్లిక్, ఈక్వటోరియల్ గినియా, గాంబియా, లైబీరియా, మలావి, మాలి, కిట్స్, మౌరిటానియా, లూసియా, వనువాటు, జింబాబ్వే!

వాస్తవానికి ఈ ప్రయాణ నిషేధం ఇంకా విడుదల కానప్పటికీ.. త్వరలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ విడుదలవుతుందని చెబుతున్నారు. ఈ ప్రయాణ నిషేధం ప్రస్తుత యూఎస్ వీసా హోల్డర్లకు ఎలాంటి అంతరాలను కలిగిస్తుందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. అందువల్ల.. ఈ దేశాలలో దేనికైనా చెందినవారు ఉంటే.. వారు వీలైనంత త్వరగా ఇమ్మిగ్రేషన్ లాయర్ సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

Tags:    

Similar News