యూఎస్ లో తెలుగు విద్యార్థి హత్య... నిందితుడికి 60 ఏళ్ల జైలు శిక్ష!

ఈ కేసులో కోర్టు తాజాగా సంచలన తీర్పు వెల్లడించింది.

Update: 2024-10-14 05:30 GMT

అమెరికాలో వివిధ కారణాలతో మృత్యువాత పడుతున్న తెలుగు విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతేడాది అక్టోబరులో ఇండియానాలోని వాల్పరైసో లోని జిమ్ లో తెలంగాణలోని ఖమ్మం పట్టణానికి చెందిన వరుణ్ రాజ్ పుచ్చా పై ఓ వ్యక్తి దాడి చేయగా.. సుమారు తొమ్మిది రోజుల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి చివరికి ప్రాణాలు కోల్పోయాడు.

వాల్పరైసో యూనివర్సిటీలో కంప్యూట ర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న వరుణ్... మరో రెండు నెలల్లో ఎంఎస్ పూర్తిచేసుకోనున్న సమయంలో ఈ ఘోరం జరిగింది! ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని పోర్టర్ టౌన్ షిప్ కి చెందిన జోర్డాన్ ఆండ్రేడ్ (25) ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోర్టు తాజాగా సంచలన తీర్పు వెల్లడించింది.

అవును... యూఎస్ లో హత్యగావించబడిన వరుణ్ రాజ్ పుచ్చా కేసులో.. జోర్దాన్ ఆండ్రెడ్ ను దోషిగా నిర్ధారించింది పోర్టర్ సుపీరియర్ కోర్టు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి జెఫ్రీ క్లైమేర్... నేరస్తుడికి శిక్షను ఖరారు చేశారు! ఇందులో భాగంగా... అతడికి 60 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. అతడి మానసిక రోగి అని నిర్ధారించారు.

అయితే... ఆండ్రేడ్ తన శిక్షను రెగ్యులర్ జైలులోనే అనుభవిస్తారా.. లేక, మానసిక ఆరోగ్యానికి చికిత్స అందించే చోట చేస్తారా అనేది ఇండియానా డిపార్ట్మెంట్ ఆఫ్ కరెక్షన్ (ఐడీఓసీ) తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ రాలేదని తెలుసుతోంది.

కాగా... జిమ్ లో ఉన్న వరుణ పై ఆండ్రేడ్ దాడిచేసిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో వరుణ్ తలకు బలమైన గాయం కావడంతో చికిత్స కోసం ఫోర్ట్ వేన్ లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ... తొమిది రోజుల పోరాటం తర్వాత వరుణ్ మరణించాడు.

Tags:    

Similar News