ఐదుగురు భర్తలకు 'హెచ్ ఐవీ' షాకిచ్చిన నిత్య పెళ్లి కూతురు!

అయితే, తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఓ కిలేడీ చేతిలో మోసపోయిన పెళ్లి కొడుకులకు హెచ్ఐవీ సోకడంతో వారంతా లబోదిబోమంటున్నారు.

Update: 2024-06-28 04:20 GMT

ఈ మధ్య కాలంలో నిత్య పెళ్లి కూతుళ్ల మోసాలు చూస్తూనే ఉన్నాం. ఒకటికి పది పెళ్లిళ్లు చేసుకొని భర్తలకు మస్కా కొట్టి డబ్బు, నగలతో ఉడాయిస్తున్న కిలేడీల ఘటనలు అనేకం ఉన్నాయి. తాము మోసపోయామని తెలుసుకున్న పెళ్లి కొడుకులకు డబ్బు, నగలు మాత్రమే పోయేవి. అయితే, తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఓ కిలేడీ చేతిలో మోసపోయిన పెళ్లి కొడుకులకు హెచ్ఐవీ సోకడంతో వారంతా లబోదిబోమంటున్నారు.

యూపీలో 20 ఏళ్ల యువతి ఐదుగురు యువకులను పెళ్లి చేసుకుంది. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకొని వారితో ఫస్ట్ నైట్ జరుపుకుంది. తొలి రేయి మధురానుభూతుల్లో మునిగి తేలుతున్న పెళ్లి కొడుకు నిద్ర లేవక ముందే ఆ కిలేడీ రాత్రికి రాత్రే జంపైంది. తన భర్తల దగ్గర డబ్బు, నగలు తీసుకొని చెక్కేసింది. ఇలా ఈమె చేతిలో ఏకంగా ఐదుగురు మోసపోయారు. చివరకు ఈ పంచాయతీ పోలీసుల దగ్గరకు చేరింది. ఎట్టకేలకు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అయితే, అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది.

మీరట్ పోలీసులు ఆ యువతిని అరెస్టు చేసినప్పుడు ఆమె గర్భవతి కావడంతో వైద్య పరీక్షలు చేయించారు. అక్కడ ఫలితాలు చూసిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది. ఆ యువతికి పరీక్షల్లో హెచ్‌ఐవీ పాజిటివ్‌ అని తేలడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఇపుడు ఆ యువతి ఏ పెళ్లి కొడుక్కి వల పన్నింది, ఎవరితో శారీరక సంబంధం పెట్టుకుంది అని వెతికే పనిలో పడ్డారు పోలీసులు.

వారితో పాటు యువతి చేతిలో మోసపోయిన ఆ ఐదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీంతో, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఆ యువకుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆ యువకులు దొరికితే వారిలో ఎంతమందికి హెచ్ ఐవీ సోకింది అన్నది తేలుతుంది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags:    

Similar News