ఒకప్పుడు టీయారెస్ లో నంబర్ టూ...ఇపుడు పాపం పరిస్థితి ఇలా ఉంది....!
అనంతరం కాంగ్రెస్ మీదుగా బీజేపీలోకి వచ్చి చేరారు అయితే ఆమెకు బీజేపీలో తగిన గౌరవం అయితే దక్కడంలేదు అంటున్నారు. ఆమె పార్టీలో ఉన్నారంటే ఉన్నారు అన్నట్లుగా పరిస్థితి మారింది.
ఆమె ఫైర్ బ్రాండ్. తెలంగాణా ప్రజలకు రాములమ్మ. మూడు దశాబ్దాల పాటు సినీ రంగంలో సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులతో ఆమె రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత సొంత పార్టీ పెట్టినా తరువాత బీజేపీలో ఉన్నారు. అయితే తెలంగాణా ఉద్యమ సమయంలో ఆమె టీయారెస్ లో చేరి కేసీయార్ కి సిసలైన చెల్లెమ్మగా మారిపోయారు. ఇద్దరే ఇద్దరు ఎంపీలు కేసీయార్, విజయశాంతి తెలంగాణా రాష్ట్రం సాధించే సమయంలో ఉన్నారు. ఆయన విజయశాంతి టీయారెస్ లో నంబర్ టూ గా కీలకమైన పాత్ర పోషించారు.
అనంతరం కాంగ్రెస్ మీదుగా బీజేపీలోకి వచ్చి చేరారు అయితే ఆమెకు బీజేపీలో తగిన గౌరవం అయితే దక్కడంలేదు అంటున్నారు. ఆమె పార్టీలో ఉన్నారంటే ఉన్నారు అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇదిలా ఉంటే ఆమె తెలంగాణా బీజేపీ మాజీ ప్రెసిడెంట్ బండి సంజయ్ వైపు ఉన్నారన్న ప్రచారం ఆమెకు ఇబ్బంది గా మారిందా అన్నది ఒక చర్చ. ఎందుకంటే అప్పట్లో ఆమె బండి సంజయ్ ని మార్చకుండా ఉండాల్సింది అని ఒక ప్రకటన చేశారు.
ఇదిలా ఉంటే తెలంగాణాలో సీడబ్ల్యూసీ మీటింగ్ ఇటీవల జరిగింది. ఈ మీటింగ్ మీద కూడా విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అయితే ఆమె సోనియాగాంధీ అంటే తనకు గౌరవం, వ్యక్తిగతంగా అభిమానం అంటూ చేసిన కామెంట్స్ ఇపుడు బీజేపీలో అగ్గి పుట్టిస్తున్నాయి. విజయశాంతి పార్టీ మారిపోతారు అని కూడా ప్రచారం స్టార్ట్ చేశారు.
దాని మీద లేటెస్ట్ గా ఆమె మరోసారి ఫైర్ అయ్యారు. సొంత పార్టీ వారే ఇలా ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. కొందరు నేతలు పనిగట్టుకుని మరీ ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆమె విమర్శించారు. అంతే కాదు పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామలను కొందరు నేతలు లీక్ చేస్తున్నారు అని ఆమె చెప్పడం విశేషం. అలా విజయశాంతి బీజేపీలో కొందరు నేతల మీద టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది అంటున్నారు.
పార్టీలో బండి సంజయ్ వ్యతిరేక వర్గం ఆమె మీద ఇలా దుష్ప్రచారం చేస్తోంది అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే దగ్గరలో ఎన్నికలు ఉన్నాయి. ఈ టైంలో ఐక్యంగా ఉండాల్సిన బీజేపీలో ఈ లుకలుకలు ఏంటి అన్న చర్చ కూడా మొదలైంది. పార్టీలో వర్గాలు ఉన్నాయని గ్రూపులు రగులుతున్నాయని విజయశాంతి మాటలతో తేటతెల్లమైంది అని అంటున్నారు.
ఏది ఏమైనా ఈ పరిణామాలు ఎన్నికల వేళ కమలం పార్టీకి మంచిది కాదు అనే అంటున్నారు. కానీ అగ్గి అయితే రాజుకుంది. దాన్ని ఆర్పడం వల్ల కాదు అనే అంటున్నారు. చూడాలి మరి ఇది ఎంత దాకా వెళ్తుందో. ఏది ఏమైనా విజయశాంతి బీజేపీలో ఏమీ కాకుండా ఉన్నారా అన్నదే ఆమె అభిమానుల వేదనగా ఉందిట.