పీపుల్స్ రెస్పాన్స్ టీం - వలంటీర్లు: జ‌గ‌న్ వ‌ర్సెస్ కూట‌మి ..!

ఈ ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన ప‌రిణామాల‌తో అప్ప‌టి వ‌ర‌కు త‌న‌వారే అనుకున్న వ‌లంటీర్లు .. జ‌గ‌న్‌కు ఎదురుతిరిగారు. ప‌రోక్షంగా వారు కూట‌మి పార్టీల త‌ర‌ఫున ప్ర‌చారం చేశారు.

Update: 2025-01-01 05:16 GMT

వైసీపీ ప్ర‌భుత్వం గురించి ఎప్పుడు మాట్లాడాల్సి వ‌చ్చినా.. ఎవ‌రు నోరు విప్పినా.. వలంటీర్లు-స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ల‌ను విస్మ‌రించ‌లేరు. వైసీపీ వ‌స్తూ వ‌స్తూనే తొలి మూడు మాసాల్లోనే వ‌లంటీర్లు, స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ల‌ను తీసుకువ‌చ్చింది. తొలి ఏడాదిలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు వ‌లంటీర్ల‌ను చేరువ చేసింది. ఇది ఒక రికార్డు కార్య‌క్ర‌మం. దీనిని ఎవ‌రూ తోసిపుచ్చ‌లేరు. కూట‌మి ప్ర‌భుత్వంలో మంత్రులుగా ఉన్న వారు గ‌తంలో ఇదే విష‌యాన్ని ఒప్పుకొన్నారు కూడా.

అయితే.. ఈ ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన ప‌రిణామాల‌తో అప్ప‌టి వ‌ర‌కు త‌న‌వారే అనుకున్న వ‌లంటీర్లు .. జ‌గ‌న్‌కు ఎదురుతిరిగారు. ప‌రోక్షంగా వారు కూట‌మి పార్టీల త‌ర‌ఫున ప్ర‌చారం చేశారు. ఇది వైసీపీ పుట్టి ముంచేసింది. ఇక‌, ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం వారిని పూర్తిగా ప‌క్క‌న పెట్టింది. అస‌లు వ్య‌వ స్థేలేన‌ప్పుడు.. మేం ఏం చేస్తాం అంటూ.. సీఎం, డిప్యూటీ సీఎంలు కూడా చెబుతున్నారు. సో.. వ‌లంటీర్లు ఇప్ప‌టికైతే.. ముగిసిన చ‌రిత్రే.

కానీ, ఇటీవ‌ల తాడేప‌ల్లి వ‌ద్ద కొంద‌రు వ‌లంటీర్లు ఆందోళ‌న చేశారు. ఆ విష‌యం మీడియాలో పెద్ద‌గా రాలే దు. త‌మ‌ను చేర్చుకున్న‌ది వైసీపీ కాబ‌ట్టి.. త‌మ‌కు ఉద్యోగాలు క‌ల్పించేలా ఉద్య‌మం చేయాల్సిన బాధ్య‌త కూడా వైసీపీపైనే ఉంద‌న్న‌ది వ‌లంటీర్లు చెప్పిన మాట‌. కానీ, ఈ విష‌యాన్ని జ‌గ‌న్ సీరియ‌స్‌గా లేదు. పైగా.. ఆయ‌న పార్టీ నేత‌ల అభిప్రాయాల‌నే ఇప్పుడు ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటున్నారు. వీరు గుండుగుత్త గా.. వలంటీర్ల వ్య‌వ‌స్థ‌కు వ్య‌తిరేకమ‌ని తేల్చి చెబుతున్నారు.

చివ‌రి నిముషంలో వ‌లంటీర్లు యూట‌ర్న్ తీసుకున్నారు. దీంతో త‌మ‌కు ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య బంధం చెడిపో యింద‌ని మెజారిటీ నాయ‌కులు చెబుతున్నారు. దీంతో వ‌లంటీర్లు అనే మాటే వినిపించేందుకు వారు ఇష్ట‌ప‌డ‌డం లేదు. దీంతో జ‌గ‌న్ కూడా.. వ‌లంటీర్ల వ‌ల్లే న‌ష్టం ఎక్కువ‌గా జ‌రిగింద‌ని అంచ‌నాకు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. నిజానికి వ‌చ్చే ఏడాది నుంచి అయినా.. వ‌లంటీర్ల‌కు మేలు జ‌ర‌గాల‌ని ఆయ‌న కోరుకున్నారు. కానీ, మెజారిటీ పార్టీ నాయ‌కులు వ‌లంటీర్ల‌ను తీవ్రంగా వ్య‌తిరేకించ‌డం వారే త‌మ‌ను ఓడించార‌ని తెలియడంతో.. ఇప్పుడు పూర్తిగా జ‌గ‌న్ వ‌లంటీర్ల విష‌యాన్నిప‌క్క‌న పెట్టేశారు.

అంతేకాదు.. ఎప్పుడు ఎన్నికలు జ‌రిగినా.. వైసీపీ క‌నుక అధికారంలోకి వ‌స్తే.. వ‌లంటీర్ల ప్ర‌స్తావ‌న ఈ సారి ఉండ‌ద‌ని సీనియ‌ర్ నాయ‌కులు చెబుతున్నారు. మ‌రోవైపు.. 2025లో జ‌న్మ‌భూమిక‌మిటీల‌ను ఏర్పాటు చేసేందుకు.. కూట‌మి స‌ర్కారు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే.. దీనికి వేరే పేరు పెట్టే అవ‌కాశం ఉంద‌ని.. `పీపుల్ రెస్పాన్స్ టీం`గా పేరు పెట్ట‌వ‌చ్చ‌ని కూట‌మి నాయ‌కులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఇది ప్ర‌తిపాద‌న‌ల ద‌శ‌లో ఉంద‌ని స‌మాచారం.

Tags:    

Similar News