టీడీపీ బాటలోనే జనసేన నడుస్తుందా ?

అసలు మొదటినుండి చెబుతున్నట్లుగా ఒంటరిగానే పోటీచేయకుండా చివరినిముషంలో జనసేనతో పొత్తుకు బీజేపీ ఎందుకు డిసైడ్ చేసిందో కూడా అర్ధంకావటంలేదు.

Update: 2023-11-03 04:48 GMT

తెలంగాణా ఎన్నికల్లో పోటీనుండి తప్పుకునే విషయమై జనసేన ఆలోచిస్తోందా ? పార్టీవర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాల వల్ల టీడీపీ పోటీనుండి తప్పుకున్న విషయం తెలిసిందే. తెలంగాణాలో పోటీకి జనసేన 32 నియోజకవర్గాలను గుర్తించింది. చివరి నిముషంలో బీజేపీతో కుదిరిన పొత్తు కారణంగా నియోజకవర్గాలను కుదించుకున్నది. అయితే బీజేపీతో పొత్తు ఖాయమైంది కానీ నియోజకవర్గాలు ఏవి, ఎన్ని సీట్లలో జనసేన పోటీచేస్తుందనే విషయంలో అయోమయం పెరిగిపోతోంది.

బీజేపీ వైఖరి కారణంగా అసలు పోటీ నుంచి తప్పుకుంటే ఎలాగుంటుందనే ఆలోచన పార్టీలో మొదలైనట్లు సమాచారం. కారణం ఏమిటంటే ఎన్నిరోజులైనా సీట్ల సంఖ్య, నియోజకవర్గాలను బీజేపీ ఫైనల్ చేయకపోవటమే. పై రెండు అంశాలను బీజేపీ ఎందుకు పెండింగ్ పెట్టిందో ఎవరికీ అర్ధంకావటంలేదు. తాను పోటీ చేయదలచుకున్న నియోజకవర్గాలను వదిలేసి మిగిలిన వాటిని జనసేనకు ఇచ్చేయచ్చు. ఒకటిరెండు రోజులు చర్చలు జరిపితే పొత్తులు ఫైనల్ అయిపోతుంది.

అయినా సరే రెండు పార్టీల్లో నేతలు ఈ దిశగా చొరవ తీసుకున్నట్లు కనబడలేదు. కారణాలు ఏమిటో ఎవరికీ అర్ధంకావటంలేదు. అసలు మొదటినుండి చెబుతున్నట్లుగా ఒంటరిగానే పోటీచేయకుండా చివరినిముషంలో జనసేనతో పొత్తుకు బీజేపీ ఎందుకు డిసైడ్ చేసిందో కూడా అర్ధంకావటంలేదు. పొత్తుపేరుతో జనసేనను దగ్గరే పెట్టుకుని దెబ్బకొట్టడమే అసలు ఉద్దేశ్యమా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే నిజమైతే దీనివల్ల బీజేపీకి వచ్చే లాభంఏమిటన్నది కీలకమైన పాయింట్. మామూలుగా అయితే రెండుపార్టీలు పొత్తు పెట్టుకుంటే రెండూ ఏదోస్ధాయిలో లాభపడాలి.

అంతేకానీ నష్టపోవటానికి పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఒక్కోసారి ఏదేదో అంచనాలు వేసుకుని పొత్తులు పెట్టుకుంటాయి. వర్కవుటవనపుడు నష్టాలు తప్పవు. కానీ ఇక్కడ బీజేపీకి ఉన్న బలమే అంతంతమాత్రం. ఇక జనసేనకు అయితే బలమే లేదు. ఇలాంటి రెండుపార్టీలు కలిసి ఎన్నికల్లో కలిసి వెళ్ళాలని నిర్ణయించటమే ఆశ్చర్యంగా ఉంది. మొత్తానికి పొత్తుబంధంలో జనసేనకు ఇరికించేసుకుని బీజేపీ డ్రామాలు ఆడుతోందనే అనుమానాలైతే పెరిగిపోతున్నాయి. అందుకనే అసలు పోటీలో నుండే తప్పుకుంటే ఎలాగుంటుందనే చర్చ పెరిగిపోతోందని సమాచారం. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News