ఆఫీసుకు.. సెలవులకు లింకు పెట్టిన విప్రో?

కరోనా తర్వాత ఆఫీసులకు ఉద్యోగుల్ని ఇంటికి తెప్పించే విషయంలో ఐటీ సంస్థలు కిందా మీదా పడుతున్నాయి.

Update: 2024-09-17 22:30 GMT

కరోనా తర్వాత ఆఫీసులకు ఉద్యోగుల్ని ఇంటికి తెప్పించే విషయంలో ఐటీ సంస్థలు కిందా మీదా పడుతున్నాయి. కరోనా ముచ్చట పోయి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా.. ఐటీ ఉద్యోగులు మాత్రం కరోనాకు ముందు మాదిరి ఆఫీసులకు వచ్చి పని చేసే విషయం మీద ఏదోలా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో.. వారిని ఏదోలా ఆఫీసులకు తీసుకొచ్చే విషయంలో కిందా మీదా పడుతున్నాయి కంపెనీలు. మరీ.. ఎక్కువ ఒత్తిడి చేస్తే.. ఉద్యోగాలకు సైతం రిజైన్ చేసేందుకు కొందరు ఉద్యోగులు రెఢీ అవుతున్నారు.

దీంతో.. వారిని ఆఫీసులకు తీసుకొచ్చే విషయంలో కంపెనీలు కఠిన పరీక్షల్ని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి వేళ.. ఐటీ దిగ్గజం విప్రో కొత్త ఎత్తుగడను తెర మీదకు తీసుకొచ్చింది. వర్కు ఫ్రం ఆఫీసుకు సంబంధించి కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఆఫీసులో అటెండెన్స్ కు లీవులకు లింక్ పెట్టిన వైనం ఆసక్తికరంగా మారింది. ఈ కొత్త విధానంలో ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసుకు వచ్చి పని చేయాల్సి ఉంటుంది. లేదంటే వారికి ఉన్న లీవ్స్ ను వదులుకోవాల్సి ఉంటుంది.

కొత్త ఆఫీస్ పాలసీ గురించి ఈ నెల రెండున ఉద్యోగులకు మొయిల్ పంపినట్లుగా చెబుతున్నారు. ఈ పాలసీకి అందరు ఉద్యోగులు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. ఎవరికైనా వర్కు ఫ్రం హోం రిక్వెస్టులకు అనుమతి ఇచ్చి ఉంటే.. తక్షణమే వాటిని రద్దు చేసి.. వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులకు రావాల్సి ఉంటుందని పేర్కొంది.

ఇదే విషయాన్ని హెచ్ ఆర్ విభాగానికి ఆదేశాలు జారీ అయినట్లుగా ప్రముఖ మీడియాసంస్థల కథనాల్లో పేర్కొన్నారు. వారానికి మూడు రోజులు ఆఫీసుకు రాకుంటే.. ఆ రోజుల్ని సెలవుగా పరిగణిస్తారు. అయితే.. విధానం అందరికి అని చెబుతున్నా.. కొన్ని ప్రాజెక్టుల్లో పని చేసే ఉద్యోగులకేనని.. అందరికి కాదని చెబుతున్నారు. మొత్తంగా కొత్త పాలసీపై ఉద్యోగులు కొంతమేర నిరాశతో ఉన్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News