వారసులంతా ఓటమిపాలు !

ఈ సారి పలువురు వైసీపీ సీనియర్‌ నేతలు తమ వారుసులకు సీట్లు ఇప్పించుకుని ఎన్నికల బరిలోకి దింపారు

Update: 2024-06-04 12:07 GMT

ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం – జనసేన- బీజేపీ కూటమి హవా కొనసాగుతున్నది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం అయిన మేజిక్ ఫిగర్ దాటి మెజారటి స్థానాల గెలుపు దిశగా ముందుకు సాగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం ఎదుర్కొంటున్నది. ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అనేక ప్రయోగాలు చేసింది. వారసులను రంగంలోకి దింపింది. అయితే వారసులంతా ఈ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం గమనార్హం.

ఈ సారి పలువురు వైసీపీ సీనియర్‌ నేతలు తమ వారుసులకు సీట్లు ఇప్పించుకుని ఎన్నికల బరిలోకి దింపారు. అయితే ఒక్కరు కూడా గెలవక పోవడం విశేషం. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్‌ రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి కుమారుడు మోహిత్‌ రెడ్డి, బందరులో పేర్నినాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి, జీడీ నెల్లూరులో నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మి తదితరులు అందరూ ఓటమి పాలయ్యారు.

ఇక ఈ ఎన్నికల్లో అనేక మంది నేతలను నియోజకవర్గాలు మార్పించి బరిలోకి దించినా ప్రయోజనం లేకుండా పోయింది. మారిన వారందరూ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించిన పార్టీ అధంపాతాళానికి జారిపోవడం గమనార్హం. మంత్రులలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మిగిలిన వారు అందరూ ఓటమి పాలయ్యారు.

Tags:    

Similar News