ర‌న్యారావు ఆమె తండ్రిపై ప్ర‌సారాలు ఆపాలి!

బంగారు అక్రమ రవాణా కేసుకు సంబంధించి మార్చి 3న క‌న్న‌డ న‌టి రన్యారావును అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-04-10 09:41 GMT
ర‌న్యారావు ఆమె తండ్రిపై ప్ర‌సారాలు ఆపాలి!

బంగారు అక్రమ రవాణా కేసుకు సంబంధించి మార్చి 3న క‌న్న‌డ న‌టి రన్యారావును అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసును కోర్టుల ప‌రిధిలో విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో రన్యా రావు, ఆమె స‌వ‌తి తండ్రి ఐపీఎస్ అధికారి కె. రామచంద్ర రావుపై తప్పుడు లేదా పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను మీడియా ప్రచురించకుండా లేదా ప్రసారం చేయకుండా నిరోధించడానికి తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు మంగళవారం కేంద్రాన్ని ఆదేశించింది.

కోర్టు ఆదేశం ఉన్నప్పటికీ మీడియా ఛానెల్‌లు ఇప్పటికీ తనపై కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయని రామచంద్ర న్యాయవాది పేర్కొన్న తర్వాత జస్టిస్ ఎం. నాగప్రసన్న ఈ ఉత్తర్వు జారీ చేశారు. మరోవైపు న‌టి ర‌న్యారావు గురించి కార్యక్రమాలను ప్రసారం చేయడాన్ని మీడియా నిలిపివేసిందని రన్యా తల్లి , పిటిషనర్ హెచ్.పి. రోహిణి తరపు న్యాయవాది మరొక పిటిషన్‌లో సమర్పించారు.

కేంద్ర ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సొలిసిటర్ జనరల్ శాంతి భూషణ్ హెచ్, మీడియా సంస్థలకు ఇప్పటికే తగిన సూచనలు జారీ చేశారని వెల్ల‌డించారు. ముందుగా సూచించిన‌ విధంగా ప్రభుత్వం ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని కోర్టుకు నిర్ధారించాలి. ఈ విషయాన్ని జూన్ మొదటి వారం లోగా కోర్టుకు తెలియ‌జేయాల‌ని జస్టిస్ నాగప్రసన్న విచారణను వాయిదా వేస్తూ అన్నారు. ర‌న్యారావు కేసులో ప‌లువురు సెల‌బ్రిటీల పేర్లను మీడియాలు బ‌య‌ట‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ఒక తెలుగు సినీప‌రిశ్ర‌మ ప్ర‌ముఖుడు ఉన్నారు.

Tags:    

Similar News