సుచిర్ బాలాజీ తల్లి సందేహాలతో ఏకీభవించిన ఎలాన్ మస్క్!

అవును... టెక్ ప్రపంచంలో సంచలనంగా మారిన సుచిర్ బాలాజీ మృతిపై తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-12-30 05:28 GMT

చాట్ జీపీటీ మాతృ సంస్థ "ఓపెన్ ఏఐ" సమాజానికి హాని కలిగొస్తోందని గతంలో విమర్శలు చేసిన భారత సంతతికి చెందిన విజిల్ బ్లోయర్ సుచిర్ బాలాజీ (26) మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయం ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా మారింది. టెక్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు.. సంచలన వ్యాఖ్య చేశారు.

అవును... టెక్ ప్రపంచంలో సంచలనంగా మారిన సుచిర్ బాలాజీ మృతిపై తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తమ కుమారుడి మృతిపై తాము ప్రైవేట్ ఇన్వెస్టిగేషటర్ ను నియమించుకొని రెండోసారి పోస్టుమార్టం చేశామని.. ఆ పరీక్ష ఫలితాలు, పోలీసులు చెప్పిన దానికి భిన్నంగా ఉన్నాయని సుచిర్ బాలాజీ తల్లి పూర్ణిమారావ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఇదే సమయంలో... సుచిర్ అపార్ట్మెంట్ ను ఎవరో దోచుకున్నట్లుగా కనిపిస్తోందని.. బాత్ రూమ్ లో ఘర్షణ జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని.. రక్తపు మరకలు కనిపించాయని.. ఎవరో అతడిని కొట్టి ఉంటారని తమకు అనిపిస్తోందని.. అయితే.. ఈ ఘోరమైన హత్యను అధికారులు మాత్రం ఆత్మహత్యగా తేల్చి చెప్పారని.. ఈ విషయంపై ఎఫ్.బీ.ఐ తో దర్యాప్తు జరిపించాలని.. తమకు న్యాయం జరగాలి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

ఈ నేపథ్యంలో సుచిర్ బాలాజీ తల్లి పూర్ణిమా రావ్ సోషల్ మీడియా వేదికగా వ్యక్త పరిచిన సందేహాలు, రిక్వస్టులకు సంబంధించిన పోస్ట్ ను ఎలాన్ మస్క్ తో పాటు వివేక్ రామస్వామి, భారత విదేశాంగ శాఖకు ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన ఎలాన్ మస్క్.. "ఇది ఆత్మహత్యలా అనిపించడం లేదు" అని పోస్ట్ చేశారు. దీంతో... ఈ విషయం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు.

కాగా... సుచిర్ బాలాజీ నాలుగేళ్ల పాటు ఓపెన్ ఏఐ లో పరిశోధకుడిగా పనిచేశారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టులో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... సమాజానికి ప్రయోజనం కంటే హాని కలిగించే టెక్నాలజీ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్!) అభివృద్ధి కోసం తాము పనిచేయాలని అనుకొవడం లేదని అన్నారు.

ఇదే సమయంలో... చాట్ జీపీటీ డెవలప్మెంట్ సమయంలో సంస్థ కాపీ రైట్ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. అదేవిధంగా... వ్యక్తుల, వ్యాపార సంస్థల రాబడి అవకాశాలను చాట్ జీపీటీ, ఇతర చాట్ బాట్ లు ధ్వసం చేస్తున్నాయని ‘న్యూయార్క్ టైమ్స్’ తో మాట్లాడుతూ పేర్కొన్నారు. దీంతో... దీనిపై అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసుల్లో బాలాజీ సాక్ష్యం కీలకం అని అంటున్నారు.

సరిగ్గా ఈ సమయంలో నవంబర్ 26న శాన్ ఫ్రాన్సిస్కో లో తన అపార్ట్మెంట్ లో నవంబర్ 26న ఆయన విగతజీవిగా కనిపించారు సుచిర్ బాలాజీ. పోలీసులు దీన్ని ఆత్మహత్యగా నిర్ధారించారు. అయితే.. తన కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అతని తల్లి పూర్ణిమారావ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. మస్క్ స్పందిస్తూ.. ఆమె అనుమానాలతో ఏకీభవించారు.

Tags:    

Similar News