దేశంలో ఈ వైరస్ మహమ్మారి స్వైరవిహారం చేస్తోంది. రోజురోజుకూ వైరస్ తీవ్రత అంతకంతకూ పెరిగిపోతుంది. వైరస్ ధాటికి సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేకి, వారి కుటుంబంలో మొత్తం 18 మంది వైరస్ బారినపడినట్లు ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది.
రాజస్థాన్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని బారీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గిరిరాజ్ సింగ్ మలింగకు గత వారం కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు వైరస్ టెస్టులు చేశారు. వారిలో 18 మందికి వైరస్ సోకినట్లు రిపోర్టులు రావడంతో కలకలం రేగింది. దీంతో వారందరినీ ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఎమ్మెల్యే, వారి కుటుంబ సభ్యులతో సమీపంగా మెలిగిన వారిని గుర్తించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 14,930 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు వైరస్ బారినపడి 349 మంది చనిపోయారు.