వలస దారుల స్వర్గదామమైన అమెరికాలో దర్జాగా ఎంట్రీ ఇచ్చేందుకు ఉద్దేశించిన హెచ్ 1 బి వీసాలకు అమెరికా చట్టసభలలో బిల్లుల గండం పొంచి ఉంది. ఓ వైపు ట్రంప్ ప్రభుత్వం వీసా సంస్కరణలకు భారీ స్థాయిలో కసరత్తు సాగిస్తుండగా మరో వైపు సెనెట్‌లోనూ, ప్రతినిధుల సభలోనూ ఇప్పటికే వీసాకు ప్రతిఘాతంగా ఉండే అరడజన్ బిల్లులను ప్రవేశ పెట్టారు. హెచ్1 బి వర్క్ వీసాలు భారతీయ టెక్కీలకు ,ఇండియన్ ఐటి కంపెనీలకు ప్రయోజనం కల్గిస్తున్నాయని, ఇదే క్రమంలో అమెరికన్ల ఉద్యోగ భద్రతకు భంగకరంగా మారుతున్నాయని, ఈ దశలో అమెరికన్లకే ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేసే బిల్లులు చర్చకు రానున్నాయి. అధికార రిపబ్లికన్, ప్రతిపక్ష డెమొక్రటిక్ సభ్యులు వీటిని వేర్వేరుగా ప్రవేశపెట్టారు. అయితే చట్టసభలలో ప్రస్తావనకు వచ్చే ఈ బిల్లులోని అంశాల పట్ల పరిశోధక విద్యార్థులు, ఆర్థిక వేత్తలు, సిలికాన్ వ్యాలీ సంస్థల కార్య నిర్వాహకులు విభేదించారు. అమెరికా ఉద్యోగాలకు గండిపడుతుందనే భయాందోళనలు పనికిరావని పేర్కొన్నారు.
ట్రంప్ అధికారంలోకి వచ్చిన వారం లోగానే రిపబ్లికన్ సెనెటర్ ఛుక్ గ్రేస్లీ హెచ్ 1 బి వీసా సంస్కరణల చట్టం బిల్లు తీసుకువచ్చారు. ఇక అసిస్టెంట్ సెనెట్ మైనార్టీ నేత డిక్ డర్బిన్ ఎల్ 1 వీసా రిఫార్మ్ యాక్ట్ బిల్లు తీసుకువచ్చారు. పై రెంటిలో అమెరికా వారికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనేది ఓ బిల్లు అయితే, నైపుణ్య ఉద్యోగులకు వీసాల కల్పనలో సముచిత ప్రాధాన్యత ఇవ్వాలనేది మరో బిల్లు. హెచ్ 1 బి రిఫార్మ్ బిల్లు లాటరీ విధానాన్ని వ్యతిరేకించింది. అమెరికాలో చదివిన విదేశీ విద్యార్థులకు వీసా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది. కాగా, వీసా సంస్కరణల బిల్లులోని అంశాలతో ఔట్ సోర్సింగ్‌కు, ఎల్ 1 వీసాదార్లకు నిషేధం తాకిడి ఎదురవుతుంది, అయితే కొన్ని పరిస్థితులలో యాజమాన్యం వారి అవసరాల కోసం వీటి నుంచి మినహాయింపు తెచ్చుకునేందుకు వీలుంది. అయితే ముందుగా అమెరికన్ల పని హక్కు భద్రత తరువాతనే దేనికైనా వీలుంటుంది. అయితే ఈ బిల్లుపై పూర్తి స్థాయి ఏకాభిప్రాయం అంతకు ముందు ఇమ్మిగ్రేషన్ సంస్కరణలపై సమగ్రత ఏర్పడాల్సి ఉందని కాంగ్రెస్ సభ్యులు ఒకరు తెలిపారు.
2020 నాటికి నైపుణ్యావకాశాలు, ఉద్యోగ కల్పన వంటివాటిపై సర్వే నిర్వహించిన బ్రూకింగ్స్ సంస్థ అప్పటికీ దేశంలో నైపుణ్య సాంకేతిక నిపుణుల అవసరం అర్హత ఉన్న దరఖాస్తుదార్లతో పోలిస్తే పది లక్షలకు పైగా ఉంటుందని వెల్లడించారు. దీనితో అమెరికా కీలకమైన సాంకేతిక పరిశోధనలు, ఆర్థిక అభివృద్ధి - సైబర్ సెక్యూరిటీ ఇతర అంశాలలో విదేశీ నిపుణులపైనే ఆధారపడాల్సి ఉంటుందని విశ్లేషించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/