నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌.. బాబు ఏం చేస్తారు ..!

ఈ నేప‌థ్యంలో ఉమ్మ‌డి ఉద్య‌మాల‌కు కూడా వారు తెర‌దీస్తున్నారు. ఇక‌, ఈ క్ర‌మంలో ఏపీ సీఎం చంద్ర‌బా బు ఏం చేస్తార‌న్న‌ది ప్ర‌శ్న‌.;

Update: 2025-03-09 04:09 GMT

దేశంలో 2026లో పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న చేప‌ట్ట‌నున్నారు. అయితే.. దీనికి సంబంధిం చి ఇప్ప‌టి నుంచే ఆందోళ‌న ప్రారంభ‌మైంది. జ‌నాభా ప్రాతిప‌దిక‌న నియోజ‌క‌వ‌ర్గాల ఏర్పాటు అనేది.. ఎప్పటి నుంచో ఉన్న‌దే. ప్ర‌తి 15 సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జ‌న చేస్తూనే ఉన్నారు. అయితే.. మోడీ హ‌యాంలో ఇప్ప‌టి వ‌రకు ఇది చేప‌ట్ట‌లేదు. వాస్త‌వానికి గ‌త 2021లోనే చేప‌ట్టా ల్సి ఉన్న‌ప్ప‌టికీ.. జ‌నాభా గ‌ణ‌న పూర్తి కాక‌పోవ‌డం, క‌రోనాప్ర‌భావంతో ఇది వాయిదా ప‌డింది.

ఈ నేప‌థ్యంలో 2026లో పున‌ర్విభ‌జ‌న చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం స‌మాయ‌త్తం అయింది. అయితే.. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు ఏడాదికి ముందే వివాదంగా మారిపోయింది. జ‌నాభా నియంత్ర‌ణ‌ను పాటించిన‌.. ద‌క్షి ణాది రాష్ట్రాలు ఇప్పుడు ల‌బోదిబోమంటున్నాయి. త‌మ‌కు పార్ల‌మెంటు స్థానాలు త‌గ్గిపోతాయ‌ని చెబుతు న్నాయి. జ‌నాభా ప్రాతిప‌దిక‌న నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న చేస్తే.. ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రులు బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఉమ్మ‌డి ఉద్య‌మాల‌కు కూడా వారు తెర‌దీస్తున్నారు. ఇక‌, ఈ క్ర‌మంలో ఏపీ సీఎం చంద్ర‌బా బు ఏం చేస్తార‌న్న‌ది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ప్ర‌స్తుతం 16 మంది ఎంపీల‌తో టీడీపీ కేంద్రంలోని మోడీ స‌ర్కా రుకు బ‌ల‌మైన మ‌ద్ద‌తు ఇస్తోంది. ఇత‌ర రాష్ట్రాలు చెబుతున్న‌ట్టుగా పార్ల‌మెంటు స్థానాలు త‌గ్గితే.. అది అంతిమంగా పార్టీపై ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంది.ఈ నేప‌థ్యంలోనే తమిళ‌నాడు సీఎం స్టాలిన్‌.. ఈ నెల 22న ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించేందుకు ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేస్తున్నారు.

దీనికి ఎన్డీయే మిత్ర‌ప‌క్షంగా ఉన్న టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబుకు కూడా ఆహ్వానం ప‌లికారు. దీనికి ఆయన వెళ్తారా? వెళ్ల‌రా? అనే విషయాన్ని ప‌క్క‌న పెడితే.. పార్ల‌మెంటు స్థానాల ప‌రంగా నిజంగానే పున‌ర్విభ‌జ న ద్వారా త‌గ్గితే.. ఆ ప్ర‌భావం టీడీపీపై నే ఎక్కువ‌గా ఉంటుంది. అయితే.. కేంద్రం మాత్రం పున‌ర్విభ‌జ‌న చేసినా.. ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం జ‌ర‌గ‌ద‌ని చెబుతోంది. త‌ద్వారా ఉత్త‌రాది రాష్ట్రాల్లో సీట్లు పెరిగే అవ‌కాశం ఉంటుంది. ఇది కేంద్రంలో ఏర్ప‌డే ప్ర‌భుత్వానికి ద‌న్నుగా మారుతుంది. ఇలా చూసుకుంటే.. కేంద్రంలో మ‌రోసారి మోడీ స‌ర్కారు ఏర్ప‌డినా ఆశ్చ‌ర్యం లేదు. సో.. చంద్ర‌బాబు కోరుకుంటున్న‌ది ఇదే కాబ‌ట్టి.. ఆయ‌న పెద్ద‌గా ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకోర‌నే భావిస్తున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News