రేషన్ కార్డు .. చాలామందికి ఉంటుంది. రేషన్ కార్డ్ అనేది ఓ కుటుంబ సభ్యులకి సంబంధించింది. కాబట్టి ఒక కార్డు లో ముగ్గురు , నలుగురు ఉంటారు. అదీ కాకపోతే మాది ఉమ్మడి కుటుంబం అనేవారు ఓ డజన్ మంది ఉంటారు. కానీ , ఓ రేషన్ కార్డు లో ఏకంగా 68 మంది సభ్యులు ఉన్నారు. ఇదే విచిత్రం అనుకుంటే దీని కంటే పెద్ద విచిత్రం .. ఆ 68 మందిలో హిందూ , ముస్లింలు కలిసి ఉన్నారట. ఈ ఘటన బీహార్ లో వెలుగులోకి వచ్చింది. బీహార్‌లోని మహువా ఎస్డీఓ సందీప్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక అధికారులు ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే .. వైశాలి జిల్లాలో ఆహార ధాన్యాల పంపిణీ వివరాలను పరిశీలిస్తుండగా, ఒకే కుటుంబానికి ఏకంగా 38 క్వింటాళ్ల ధాన్యం ఇచ్చినట్లు కనిపించడంతో అధికారులు అవాక్కయ్యారు. హిందూ, ముస్లింలు ఒకే కార్డులో ఉండటంపై ఆరా తీయడంపై అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనితో వెంటనే స్థానిక రేషన్ డీలర్ సంజయ్ కుమార్ పై కేసు నమోదు చేశారు. అధికారులు లబ్దిదారుల నుంచి ధాన్యాన్ని రికవరీ చేసే పనిలో పడ్డారు. ఒకే కార్డులో ఇంత మంది ఎలా వచ్చారనే దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే ఇంత మంది సభ్యులు రేషన్ కార్డులో ఉండగా, రేషన్ డీలార్ కూడా అధికారులకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆయనపై కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. అలాగే సంబంధిత అధికారులు ధాన్యాన్ని రికవరీ చేసే పనిలో ఉన్నారట.