షాకింగ్‌..మ‌రో 68 మంది CRPF జ‌వాన్ల‌కు కరోనా!

Update: 2020-05-02 08:30 GMT
దేశంలో కరోనా విజృంభ‌న కొనసాగుతూనే ఉంది. క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డిన సీఆర్పీఎఫ్ జ‌వాన్ల సంఖ్య  క్రమక్ర‌మంగా పెరిగిపోతోంది. రాజ‌ధాని ఢిల్లీలోని 31 బెటాలియ‌న్ ‌లో కొత్త‌గా మ‌రో 68 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని  అధికారులు తెలిపారు. దీంతో మొత్తం బెటాలి‌యన్‌ లో కరోనా బారిప‌డిన వారి సంఖ్య 127కు చేరింది. వారిలో 55ఏళ్ల సీఆర్పీఎఫ్ జవాను ఒక‌రు మంగళవారం మ‌ర‌ణించ‌గా - మ‌రొక‌రు వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

ఇక ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న  125 మందిలో 122 మంది జవాన్లు ఈస్ట్ ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్ -3 ప్రాంతంలో ఉన్న సీఆర్‌ పీఎఫ్ క్యాంపుకు చెందిన జ‌వాన్లే కావ‌డం గ‌మ‌నార్హం . కాగా, పారామిలటరీకి చెందిన ఓ మెడికల్ అసిస్టెంట్ ద్వారా సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా వచ్చినట్టుగా తేల్చారు అధికారులు. మరోవైపు.. ఢిల్లీ డేంజర్ జోన్‌ గా మారిపోయింది.. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఢిల్లీలోని అన్ని జోన్లను రెడ్‌ జోన్లుగానే ప్రకటించింది కేంద్రం ప్రభుత్వం. 

ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభణ కోనసాగుతుంది. ఇండియాలో కరోనా కేసులు 37వేలు దాటాయి. ఢిల్లీలో కరోనా కేసులు 3,738 చేరాయి. ప్రస్తుతం 2,510 యాక్టివ్ కేసులున్నాయి. 1,167 మంది బాధితులు ఈ కరోనా భూతం నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
Tags:    

Similar News