దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుండి నేటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. అయితే , ప్రస్తుతం కరోనా పాజిటివ్ గా వచ్చేవారిలో చాలామంది తొలిసారి కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ వచ్చి తగ్గిపోయినవారిలో మళ్లీ సోకుతున్నవారి సంఖ్య అత్యల్పంగా ఉంటుంది. యూరోపియన్ యూనియన్ వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (ఈయూ–సీడీసీ) దీనిపై క్షుణ్నంగా అధ్యయనం చేసి, తాజాగా నివేదిక విడుదల చేసింది. సెకండ్, థర్డ్ వేవ్ కరోనా వ్యాపిస్తున్న అన్నిప్రాంతాల్లో కూడా రీఇన్ఫెక్షన్ పెద్దగా లేదని తేల్చింది. ఫస్ట్ వేవ్ లో కరోనా వచ్చిన ప్రతి వెయ్యి మందిలో కేవలం ఇద్దరు ముగ్గురికే సెకండ్ వేవ్ లో సోకే అవకాశం ఉందని తేల్చింది.
అమెరికాలో 28,76,773 మంది కరోనా నెగెటివ్ వచ్చినవారు, అప్పటికే కరోనా వచ్చిపోయిన 3,78,606 మందిపై శాస్త్రవేత్తలు నాలుగున్నర నెలల పాటు అధ్యయనం నిర్వహించారు. అందులో అప్పటికి కరోనా సోకని వారిలో 3 శాతం మంది పాజిటివ్ అయ్యారు. ఖతార్ లో 43,400 మంది కరోనా బాధితులను 240 రోజులు పరిశీలించారు. మళ్లీ కరోనా వచ్చిందా, లేదా అనేదానిపై జీనోమ్ సీక్వెన్సింగ్స్ చేశారు. పాజిటివ్ వచ్చినవారిలో కొత్తరకం వైరస్ ఉందా, పాత వైరసే వచ్చిందా అని పరిశీలించారు. రీఇన్ఫెక్షన్ 0.1 శాతం మందికి మాత్రమే ఉన్నట్టు నిర్ధారించారు. బ్రిటన్ లో థర్డ్ వేవ్ కొనసాగుతోంది. అక్కడి యూకే వేరియంట్ వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఆ వేరియెంట్ బారినపడ్డ 1,769 మందిపై, ఇతర రకాల వైరస్ సోకినవారిపై వేర్వేరుగా పరిశోధన చేశారు. ఇక సిరెన్ అనే సంస్థ 20 వేల మంది ఆరోగ్య సిబ్బంది మీద అధ్యయనం చేసింది.
వారిలో మొదటి వేవ్ లో 6,614 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. సెకండ్ వేవ్ లో 362 మందికి పాజిటివ్ రాగా.. ఇందులో తొలిసారి కరోనా బారినపడ్డవారు 318 మందికాగా.. రీఇన్ఫెక్షన్‌కు గురైనవారు 44 మంది. దీన్ని బట్టి చూస్తే కరోనా వచ్చిన ప్రతి వెయ్యి మందిలో 22 మందికి మాత్రమే మళ్లీ వైరస్ అనేది పాజిటివ్ గా తేలుతుందట. కరోనా వచ్చిపోయిన వెయ్యి మందిలో ముగ్గురి వరకు మరోసారి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉండగా.. వ్యాక్సిన్లు వేసుకున్నవారిలో వెయ్యికి ఇద్దరు కరోనా బారినపడుతున్నారని సీడీసీ నివేదిక లో పొందుపరిచింది. అయితే వ్యాక్సిన్ వేసుకున్నవారికి కరోనా వస్తే, ఆరోగ్య పరిస్థితి సీరియస్ కాకుండా వంద శాతం రక్షణ లభిస్తుందని తెలిపింది. ఇజ్రాయిల్ లో మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల తర్వాత కరోనా వచ్చినవారిలో మామూలు వారితో పోలిస్తే వైరస్ లోడ్ నాలుగో వంతు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు.