రోజు ఎక్కడో ఒక చోట అమ్మాయిల ట్రాప్ లో పడి మోసపోయేవారిని చూస్తూనే ఉంటారు. కానీ , మళ్ళీ అమ్మాయి కనపడగానే ..అదేదో అజంతా శిల్పంలా ఫీల్ అయ్యి .. ఒళ్ళు తెలియకుండా అన్ని సమర్పించుకొని ,,తీరా మోస పోయాం అని తెలిసిన తరువాత లబోదిబోమంటారు. ఎందుకు చెప్పండి .. మర్యాదగా ఉంటే డబ్బుకి డబ్బులు మిగులుతాయి .. సమాజంలో పేరు కూడా చెడిపోకుండా ఉంటుంది. కానీ, మోస పోవడం అనేది మానవ నైజం కాబట్టి ఎవ్వరం ఏమి చేయలేం. తాజాగా మరో ట్రాప్ వెలుగులోకి వచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్తతో ఏకాంతంగా గడిపి ..ఆ వీడియోని అడ్డుపెట్టుకొని కోట్లు కొట్టేయాలని చూసింది. ఎక్కడో విచిత్రం ఏమిటంటే ..ఆమెకి ఆలా చేయమని చెప్పేది ..సహాయం చేసేది ఆమె భర్తనే. ఇదెక్కడి ఘోరం అదుపుచేయాల్సిన భర్తే .. సహాయం చేస్తే ఎవరైనా ఆగుతారా ..అలాగే ఈమె కూడా రెచ్చిపోయింది. కానీ , ఇప్పుడు ఊసలు లెక్కపెట్టాల్సిన స్థితి వచ్చింది.
హనీట్రాప్ .. డబ్బున్న వాళ్లకు వలపు వల విసిరి వారిని బ్లాక్ మెయిల్ చేయడం.. సమాజంలో గౌరవం మర్యాద ఉన్నవారిని సెలక్ట్ చేసుకుని వారితో సన్నిహితంగా ఉండి చివరకు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజడం వారి లక్ష్యం. ఇలాంటీ హనీ ట్రాప్ లు ఇతర మెట్రో నగరాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. ఆర్ధిక రాజధాని ముంబయి - ఢిల్లీ లాంటీ నగరాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇలాంటీ సంఘటనలు హైదరాబాద్ లో కూడా మొదలైంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కనిష్క - మరియు విజయవాడకు చెందిన విజయ్ దంపతులు . వీరు హైదరాబాద్ గచ్చిబౌలీలో నివాసం ఉంటు హనీట్రాప్ కు తెర తీశారు.
ఇంతకుముందు విజయ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా - కనిష్క ఎయిర్ హోస్టెస్ గా పనిచేసింది. ఆ తరువాత ఓ హోటల్ నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే హోటల్ వ్యాపారంలో నష్టాలతో పాటు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఇద్దరు భార్యభర్తలు - తమ నష్టాలను పూడ్చుకునేందుకు హనీట్రాప్ కు ప్లాన్ వేశారు. పరిచయమైన ఓ వ్యాపారిని సెలెక్ట్ చేసుకుని ముగ్గులోకి దింపారు. కనిష్కా వ్యాపారితో సన్నిహిత సంబంధాలను పెట్టుకుంది. తాను ఓ స్వఛ్చంద సంస్థను నడుపుతున్నట్టు క్రియేట్ చేసింది. వారికి సహాయం చేయడంతో పాటు ఇతర కార్యక్రమాల్లో వ్యాపారిని భాగస్వామ్యం చేసింది.
ఇక ట్రాప్ లో పడ్డ వ్యాపారి కనిష్కకు అప్పటికే పదిలక్షల రూపాయలను అందించాడు. పది లక్షలతో వదలని ఆ జంట చివరి ప్రయత్నానికి తెరతీశారు. దీంతో ఓ రోజు వ్యాపారిని రిసార్ట్ కు రమ్మని చెప్పి కనిష్కతోపాటు విజయ్ సైతం చేరుకున్నారు. అయితే విజయ్ రిసార్ట్ లోని ఉండగా కనిష్కా ప్లాన్ అమలు చేసింది. రిసార్ట్ కు చేరుకున్న వ్యాపారిని మాయమాటల్లో దింపి - మత్తుమందు ఇచ్చింది.. ఆయన నిద్ర పోయిన తర్వాత తనను కొట్టినట్టుగా అనంతరం రక్తం బయటకు వచ్చిన సీన్ క్రియోట్ చేసింది. ఇక అర్థరాత్రి వ్యాపారి నిద్రలేసిన తర్వాత భర్త విజయ్ ఎంటర్ అయ్యాడు. భార్యతో తిరిగిన వీడియోలు జరిగిన సంఘటనపై ఏమీ తెలియనట్టు నిలదీశాడు. అ నేపథ్యంలోనే కోటి రుపాయలు ఇవ్వాలని తేదంటే ఇద్దరి తతంగం బయట పెడతానని బెదించాడు.
ఇందుకు కోసం ఓ బాండ్ ను కూడా రాయించుకున్నాడు. ఒప్పందం ప్రకారం సంఘటన మరునాడే పదిలక్షల రుపాయలు ఇచ్చాడు. దీంతో మిగతా తొంబైలక్షల కోసం వ్యాపారీపై ఒత్తిడి తేవడంతో చివరకు ఆయన పోలీసులను ఆశ్రయించాడు. సైబరాబాద్ కమీషనరేట్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ట్విస్ట్ ఎమిటంటే కనిష్క హైదారాబాద్ వ్యాపారితో పాటు అమెరికాలో ఉంటున్న మరో వ్యక్తిని కూడా ట్రాప్ చేసినట్టు తెలుస్తోంది. ఆయనకు సంబంధించిన ఫోటోలు - ఇతర వీడీయోలు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు