సైఫ్ పై దాడి కేసు... దొంగతనానికి వెళ్తూ కత్తి దొంగిలించుకెళ్లాడు!
అది ఘటనలో వాడిన ఆ కత్తి మూడు ముక్కలవ్వడం.. తాజాగా మూడో ముక్క ఆచూకీ దొరకడం జరిగిందని చెబుతున్నారు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై బాంధ్రాలోని తన నివాసంలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి రెండు రోజుల క్రితం హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సైఫ్ పై దాడి చేసినట్లు చెబుతున్న నిందితుడు పట్టుబడటం, అతడిని కోర్టులో హాజరుపరచడం, అతడిని న్యాయస్థానం ఐదు రోజు పోలీస్ కస్టడీకి ఇవ్వడం తెలిసిందే.
ఈ సమయంలో పోలీసులు నిందితుడితో క్రైమ్ సీన్ రీక్రియేషన్ చేస్తున్నారు! ఈ సమయంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా.. తాజాగా సైఫ్ పై దుండగుడు దాడి చేసిన సమయంలో ఉపయోగించిన కత్తి గురించి ఆసక్తికర విషయాలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా ఆ కత్తి ఎక్కడిది?
అది ఘటనలో వాడిన ఆ కత్తి మూడు ముక్కలవ్వడం.. తాజాగా మూడో ముక్క ఆచూకీ దొరకడం జరిగిందని చెబుతున్నారు. ఇందులో భాగంగా... సైఫ్ పై దాడి సమయంలో దుండగుడు వాడిన కత్తిని.. అతడు ఓ హోటల్ నుంచి దొంగిలించాడంట. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మూడు ముక్కల మేటర్ తెలిసింది.
ఇందులో భాగంగా.. ఆ కత్తిలో ఒక ముక్క సైఫ్ వీపులో ఇరుక్కుపోగా.. దాన్ని ఆపరేషన్ చేసి వైద్యులు వెలికి తీశారు. ఇక రెండో ముక్క నటుడి ఇంట్లోనే దొరికింది. ఈ నేపథ్యంలో తాజాగా మూడో ముక్కను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాడి అనంతరం నడుచుకుంటూ వెళ్లిన నిందితుడు సుమారు ఒకటిన్నర కి.మీ. దూరంలో ఉన్న చిన్న చెరువు వద్ద దాన్ని పాడేసి వెళ్లాడట.
ఈ సమయంలో సీన్ రిక్రియేషన్ లో భాగంగా నిందితుడిని బాంద్రాలోని చెరువు వద్దకు తీసుకెళ్లగా ఆ ఆయుధాన్ని చూపించాడని.. దాన్ని పోలీసులు సేకరించారని అంటున్నారు. ఇదే సమయంలో.. నిందితుడు ఫకీర్ దాడికి ముందు, దాడి తర్వాత దుస్తులు మార్చి తిరిగినట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలు వెలుగులోకి రాగా.. వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే... ఈ ఘటనలో దుండగుడు వాడిన కత్తిని ఓ హోటల్ నుంచి దొంగిలించినట్లు పోలీసులు చెబుతున్నారు! దానికి సంబంధించిన మూడు ముక్కలను పోలీసులు తాజాగా స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.