సినీనటులను మించి జగన్ క్రేజ్... కన్నబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్!

ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్ గా కురసాల కన్నబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... తనకు ఆ బాధ్యతలు అప్పగించిన జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.

Update: 2025-02-23 12:54 GMT

ఏపీలో రాజకీయ వేడెక్కిన సంగతి తెలిసిందే. ఇటీవల వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అనంతరం వైసీపీ నుంచి కస్త దూకుడు పెరిగినట్లు కనిపించింది. ప్రధానంగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జైలుకు వెళ్లి వంశీని పలకరించడం.. అనంతరం గుంటూరు మిర్చి యార్డు వద్ద రైతులను కలవడంతో వాతావరణ వేడెక్కింది.

మరోపక్క.. వైసీపీ కార్యకర్తల్లో ఆ రెండిటితో పాటు పాలకొండ పర్యటనలో తోనూ కొత్త ఉత్సాహం వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయని అంటున్నారు. ఈ సమయంలో ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్ గా కురసాల కన్నబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జగన్ కు ధన్యవాదాలు తెలిపిన కన్నబాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్ గా కురసాల కన్నబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... తనకు ఆ బాధ్యతలు అప్పగించిన జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ పై ప్రశంసల జల్లులు కురింపించారు. ఇందులో భాగంగా... సినీ నటులకు సైతం లేని క్రేజ్ జగన్ కు ఉందని కన్నబాబు చెప్పుకొచ్చారు.

ప్రధానంగా... వంశీని జైల్లో కలవడానికి వెళ్లినప్పుడు, గుంటూరు మిర్చి యార్డులో రైతులను కలిసినప్పుడు, పాలకొండ పర్యటనలోనూ జగన్ ను చూసేందుకు జనం ఎగబడ్డారని.. ఈ జన ప్రభంజనం చూసి కూటమి నేతలు తట్టుకోలేకపోతున్నారని.. గత ఎన్నికల్లో తాము ఓడినప్పటికీ గ్రౌండ్ లెవెల్ లో పార్టీ మాత్రం చాలా బలంగా ఉందని కన్నబాబు తెలిపారు.

ఇక.. ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి జగన్ అని చెప్పిన కన్నబాబు.. ప్రజలను మోసం చేయాలంటే సూపర్ సిక్స్ కాదు.. జగన్ ఏకంగా సూపర్ సిక్స్ టీ ఇచ్చేవారని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత టీడీపీ కార్యకర్తలు రోడ్డు మీదకు రావడానికి మూడేళ్లు సమయం పడితే.. వైసీపీ నాయకులు, కార్యకర్తలకు మూడు నెలల సమయం కూడా పట్టలేదని అన్నారు.

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం విమర్శలు గుప్పించిన ఆయన... ఎనిమిది నెలల్లోనే కూటమి ప్రభుత్వం పరపతి కోల్పోయిందని.. రాష్ట్రంలో ప్రస్తుతం రెండే పథకాలు అమలవుతున్నాయిని.. అందులో ఒకటి చంద్రన్న పగ కాగా మరొకటి చంద్రన్న దగా అని ఎద్దేవా చేశారు.

ఇక గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేనలో గెలిచింది చాలా మంది వైసీపీ నుంచి వెళ్లినవారే ఉన్నారని.. అయితే.. జగన్ సైన్యం మాత్రం ఎక్కడా చెక్కుచెదరలేదని కన్నబాబు చెప్పారు.

Tags:    

Similar News