గుడ్ న్యూస్.. వేతనాలు 9.2శాతం పెరుగుతాయట..!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితులు, వృద్ధిరేటు తగ్గుతున్న నేపథ్యంలోనూ ఈ ఏడాది భారత్ లో వేతనాలు సగటున 9.2శాతం పెరగనున్నాయని అంతర్జాతీయ ప్రొఫెషనల్ సేవల సంస్థ ఏఆన్ పీఎల్ సీ అంచనా వేస్తోంది.

Update: 2025-02-23 11:30 GMT

ప్రైవేట్ ఉద్యోగాల పరిస్థితి దారుణంగా తయారైంది. ఏ రంగాన్ని చూసినా జీతాలు పెరగడం లేదని నొచ్చుకునేవారే ఎక్కువయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి తయారైంది. ఇప్పుడంతా గ్లోబల్ ఎకానమీ కాబట్టి ఎక్కడ ఏం జరిగినా ఆ ప్రభావం ఇతర దేశాలపై కూడా పడుతోంది. పశ్చిమాసియాలో అనిశ్చితి, రష్యా-ఉక్రేయిన్ యుద్ధం కొనసాగుతూ ఉండటం, ట్రంప్ నిర్ణయాలు..ఇలా వివిధ అంశాలు మార్కెట్ ను ప్రభావితం చేస్తున్నాయి. ఆ ఎఫెక్ట్ ఉద్యోగుల వేతనాలపై పడుతోంది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితులు, వృద్ధిరేటు తగ్గుతున్న నేపథ్యంలోనూ ఈ ఏడాది భారత్ లో వేతనాలు సగటున 9.2శాతం పెరగనున్నాయని అంతర్జాతీయ ప్రొఫెషనల్ సేవల సంస్థ ఏఆన్ పీఎల్ సీ అంచనా వేస్తోంది. 2023 వేతన పెంపు సగటు 9.3శాతంగా నమోదైందని తెలిపింది. దేశంలోనే 45 రంగాలకు చెందిన 1,400కు పైగా కంపెనీల నుంచి వివరించి సేకరించి రూపొందించిన నివేదిక ప్రకారం..

-2022 నుంచీ వేతన ఇంక్రిమెంట్లలో తగ్గుదల ధోరణి కనిపిస్తోంది. ఆ సమయంలో ‘గ్రేట్ రిజిగ్నేషన్’ ప్రభావంతో వేతనాలు సగటున 10.6శాతం పెరిగాయి. 2024లో మొత్తం మీద సిబ్బంది వలసల రేటు 17.7శాతానికి పరిమితమైంది. 2023లోని 18.7శాతం, 2022లో నమోదైన 21.4శాతంతో పోలీస్తే ఇది తక్కువే.

-అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ, ఆర్థిక పరిణామాలు, అమెరికా వాణిజ్య విధానాల ప్రభావం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, జనరేటివ్ ఏఐ ప్రగతిలో వేగవంతమైన మార్పులు తదితరాలు వేతన పెంపు తగ్గడానికి కారణంగా నిలుస్తున్నాయి. అయినా కూడా భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు స్థిరంగా ఉండటంతో, వేతన పెంపు వృద్ధిలో తగ్గుదల ఎక్కువగా ఏమీ లేదు.

-ఇంజినీరింగ్ డిజైన్ సర్వీసెస్, వాహన తయారీ బడ్జెటింగ్ విభాగాల్లో 10.2శాతం వేతన పెంపు కనిపించనుంది. బ్యాంకింగేతర కంపెనీల్లో 10శాతం మేర వేతనాలు పెరగొచ్చు.

-ఏఐ ఆధారిత వినూత్నతను అందిపుచ్చుకుంటూ కంపెనీలు స్థిర వృద్ధిని కొనసాగించవచ్చని ఏఆన్ సంస్థ పేర్కొంది.

ఏదేమైనా భారత్ లో వేతనాలు పెరిగే అవకాశం ఉండటం ఉద్యోగులుకు పెద్ద ఊరటే. ఇప్పటికే తడిసి మోపెడవుతున్న ఖర్చులతో నానా కష్టాలు పడుతున్న ఉద్యోగులకు ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లేకపోవడంతో లక్షలాది మంది ప్రైవేట్ రంగాన్ని ఆశ్రయిస్తుండటం..అక్కడ వేతనాలు తక్కువగానే ఉండటం యువతకు నిరాశే ఎదురవుతోంది. ఎన్నో అనిశ్చితి పరిస్థితుల మధ్య వేతనాల పెంపు నివేదికలు రావడం ఉద్యోగులకు సంతోషాన్ని ఇచ్చేదే.

Tags:    

Similar News