ట్రంప్ ప్రమాణంలో పన్నూ.. జై ఖలిస్థానీ నినాదాలు..
ట్రంప్ ప్రమాణం వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ లో జరిగింది.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం ముగిసి మూడు రోజులవుతున్నా ఆయన తీసుకున్న నిర్ణయాల ప్రకంపనలు ఆగడం లేదు. ఏకబిగిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు వెలువరించడం అమెరికానే కాదు ప్రపంచాన్నే షేక్ చేసింది. కాగా, ఇప్పుడు మరో సంచలనం విషయం వెలుగులోకి వచ్చింది. ట్రంప్ ప్రమాణం వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ లో జరిగింది.
ఈ కార్యక్రమానికి దేశ విదేశీ అతిథులు ఎందరో హాజరయ్యారు. ఎలాన్ మస్క్ సహా.. అమెరికాకు చెందిన పలు కార్పొరేట్ దిగ్గజాలు కూడా పాల్గొన్నారు. భద్రత పరంగా అత్యంత పకడ్బందీగా సాగిన కార్యక్రమంలో ఓ ఉగ్రవాది పాల్గొనడం అత్యంత సంచలనం రేపుతోంది.
ట్రంప్ ప్రమాణం ముగిసిన ముగిసిన రెండు రోజుల తర్వాత ఈ మేరకు వీడియోలు విడుదలయ్యాయి. ఆ ఉగ్రవాది కూడా ఎవరో కాదు.. ఖలిస్థానీ గురుపత్వంత్ సింగ్ పన్నూ. ఇప్పుడు అతడు పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నయి. అమెరికా, కెనడాల్లో ఖలిస్థానీ వేర్పాటువాదానికి పన్నూ మద్దతు అందిస్తున్నాడు. ఇలాంటివారిలో కొందరిని తీవ్రవాదులుగా పలు దేశాలు గుర్తించాయి.
పన్నూ.. అమెరికాలో ఉంటున్నా..బయటకు కనిపించే సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు ఏకంగా గా ట్రంప్ ప్రమాణస్వీకారంలో అతిరథుల మధ్య కనిపించాడు. పాల్గొనడమే కాక ఖలిస్తానీ నినాలు కూడా చేశాడు.
ట్రంప్ ప్రమాణం జరుగుతుండగా స్టేజ్ పక్కనే పన్నూ నిల్చుని.. ఖలిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేశాడు. కాగా, ఖలిస్తాన్ కోసం పోరాడుతున్న సిక్ ఫర్ జస్టిస్ జనరల్ కౌన్సెల్ పన్నూ కోసం ట్రంప్ ఈవెంట్ కు టికెట్ కొన్నట్లుగా సమాచారం. ఈ కార్యక్రమానికి పన్నూకు ఆహ్వానం లేదు. కేవలం సిక్కు సంస్థ టికెట్ ద్వారానే వచ్చాడు.
ట్రంప్ ప్రమాణం అనంతరం ఉపన్యాసం చేస్తున్న సమయంలో ప్రజలు అందరూ యూఎస్‌ఏ, యూఎస్‌ఏ అంటూ హోరెత్తిస్తుండగా.. పన్నూ మాత్రం 'ఖలిస్తాన్ జిందాబాద్' అంటూ కనిపించాడు. అతడు ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు
పైగా ట్రంప్ ప్రమాణ స్టేజ్ ను చూపిస్తూ తర్వాత తాను కనిపించేలా వీడియో తీశాడు. తన ఎక్స్ ఖాతాలో ‘ట్రంప్ ప్రమాణానికి ప్రత్యేక అతిథి’ అని కూడా పేర్కొన్నాడు.