నగ్నంగా కనిపించి బ్లాక్ మెయిల్ చేసి ఆ లేడి దోపిడీ

Update: 2020-08-17 17:30 GMT
ముంబైలో ఓ మాయలేడి అబ్బాయిలకు వలవేస్తుంది. అనంతరం మూడు సెకన్ల పాటు న్యూడ్ గా బట్టలిప్పి నగ్నంగా వీడియో కాల్ చేస్తుంది. అనంతరం కట్ చేసి అబ్బాయిలను అలా న్యూడ్ గా చేయమంటుంది. చేశారో బుక్ అయినట్టే.. వీడియో రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు దండుకుంటుంది

ముంబైలోని ఈస్ట్ గోరెగావ్ లో తాజాగా 21 ఏళ్ల ఒక గ్రాఫిక్ డిజైనర్ కు సోషల్ మీడియాలో ఒక యువతితో పరిచయం అయ్యింది. అతడితో చనువు పెరగడంతో వీడియో కాల్ చేసింది ఆ యువతి. బట్టలన్నీ విప్పి నగ్నంగా 3 సెకన్ల పాటు న్యూడ్ గా వీడియో కాల్ లో కనిపించి కట్ చేసింది. ఆ యువకుడిని అలానే చేయమని కోరింది. దీంతో నమ్మిన యువకుడు నగ్నంగా ఆమెకు వీడియో కాల్ లో కనిపించాడు. ఆ వీడియోను రికార్డ్ చేసిన యువతి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది. రూ.20వేలు ఇవ్వకపోతే వీడియో క్లిప్ ను నీ స్నేహితులు, బంధువులకు పంపిస్తానని బెదిరించింది. దీంతో షాకైన యువకుడు మొదట రూ.2వేలు పంపాడు.

అయితే ఆ యువతి సీరియస్ అయ్యి ఆ వీడియోను యువకుడి ఫ్రెండ్ కు పంపింది. దీంతో షాక్ అయిన యువకుడు మిగతా 18వేలను యువతి బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేశాడు. దీంతో ఆ యువతి కామ్ అయిపోయింది.

కొన్నిరోజులు సైలెంట్ గా ఉన్న యువతి తాజాగా మళ్లీ యువకుడికి మేసేజ్ పెట్టి మరింత డబ్బు కావాలని అడిగింది. దీంతో షాకైన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమె పేరు బ్యాంకు ఖాతాలో లాలూ ప్రసాద్ ప్రగ్యా జైన్ గా పేరు ఉందని తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు.. వ్యక్తిగత వీడియోలు పంచుకుంటే డేంజర్ అని పోలీసులు సూచిస్తున్నారు.
Tags:    

Similar News