రాజకీయాల్లో ఎన్ని అయినా మాట్లాడుకోవచ్చు. కానీ వర్కౌట్ అయ్యే చేతలు అవసరం. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి సీటుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒకనాడు అదే సీట్లో తెలుగు వారి ఇలవేలుపు నందమూరి తారకరామారావు పోటీ చేసి గెలిచారు. అలాంటి టెక్కలి నుంచి వరసగా రెండు సార్లు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు గెలుస్తూ వస్తున్నారు. అంతకు ముందు ఆయన హరిశ్చంద్రపురం నుంచి 1996 తరువాత పలుమార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. 2009లో జరిగిన శాసనసభ సీట్ల పునర్ వ్యవస్థీకరణలో హరిశ్చంద్రపురం సీటు కనుమరుగు అయిపోయింది.
అయితే అందులోని బలమైన మండలాలు టెక్కలిలో చేరడంతో ఆయన టెక్కలిని సొంత సీటుగా చేసుకున్నారు. ఇక ఆయన్ని ఓడించడానికి రెండు సార్లుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను గట్టి ప్రయత్నాలే చేశారు కానీ అసలు వీలుపడలేదు. అచ్చెన్న ఫ్యామిలీకి సంతబొమ్మాళి మండలం పూర్తిగా ఏకపక్ష మద్దతు ఇస్తూ వస్తోంది. దాంతో ఆయన విజయం ఖాయమవుతోంది. ఇక అచ్చెన్నాయుడుని ఓడించాలి అన్నది జగన్ పంతం, అందుకే ఆయన దువ్వాడ శ్రీనును ఏరి కోరి మరీ టెక్కలి వైసీపీ ఇంచార్జిని చేశారు.
అదే విధంగా ఎమ్మెల్సీగా కూడా చాన్స్ ఇచ్చారు. అధికార దర్జాతో ప్రభుత్వ సహకారంతో అచ్చెన్న దూకుడుకు అడ్డుకట్ట వేయడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి వీక్ చేయాలన్నది వైసీపీ ప్లాన్. అయితే అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ హోదాలో బాగానే దూకుడు చేస్తున్నారు. ఆయన అంతకు ముందు అయిదేళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. ఇక సుదీర్ఘకాలంగా జిల్లా రాజకీయాల్లో కింజరాపు ఫ్యామిలీ పాతుకుపోయింది. దాంతో అచ్చెన్న రాజకీయ చతురత ముందు దువ్వాడ ఎక్కడా ఆగలేకపోతున్నారు అన్న విశ్లేషణలు అయితే ఉన్నాయి.
లేటెస్ట్ గా ఒక మీడియా ఇంటర్వ్యూలో దువ్వాడ అచ్చెన్నాయుడుని చాలెంజ్ చేశారు. ఆయన అవినీతిపరుడని ఎండగట్టారు. ఆయన రాజకీయం ఈసారితో సరి అని కూడా చెప్పేశారు. అయితే దువ్వాడ మాటలకు అచ్చెన్న ఎక్కడా బదులీయలేదు. దాంతో ఆయన సైలెంట్ వెనక ఏముందో అని అంతా ఆసక్తిని చూపించారు. సడెన్ గా ఆయన టెక్కలి మండలంలోని బలమైన వైసీపీ క్యాడర్ ని టీడీపీ వైపు లాగేశారు. యాభై కుటుంబాలను టీడీపీలో చేర్చుకుని దువ్వాడకు గట్టి రిటార్ట్ ఇచ్చారు.
ఇది ఆరంభం మాత్రమే అని అచ్చెన్న అనుచరులు అంటున్నారు. త్వరలో మరింతమంది బలమైన వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకుంటామని కూడా ధీమాగా చెబుతున్నారు. టెక్కలిలో వైసీపీకి పట్టుంది. దాంతో అక్కడే వీక్ చేయడం ద్వారా అచ్చెన్న వచ్చే ఎన్నికల కోసం ఈ రోజు నుంచే కసరత్తు స్టార్ట్ చెఆశారు అంటున్నారు. మరి నిన్నటి దాకా సాగిన కధలో టీడీపీ నుంచి వైసీపీ వైపు చేరికలు ఉండేవి. ఇపుడు మాత్రం అటు నుంచి ఇటు అన్నట్లుగా అధికార పార్టీ నుంచి విపక్షం వైపు రావడం అంటే విడ్డూరమే. మరి అచ్చెన్న మార్క్ పాలిటిక్స్ ఇలాగే ఉంటుంది అంటున్నారు. దీనికి దువ్వాడ ఏ విధంగా రియాక్షన్ ఇస్తాడో చూడాల్సిందే.