రాజకీయ నాయకులు అన్నంతనే వేలాది కోట్లు వెనకేసే వారన్నట్లుగా పేరు వినిపిస్తూ ఉంటుంది. అలాంటి నేతలు కొందరు ఉండొచ్చు. అదే సమయంలో అందుకు భిన్నమైన ధోరణితో ఉండే నేతలకూ కొదవ ఉండదు. అలాంటి కోవలోకే వస్తారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. వివాదాస్పద వ్యాఖ్యలతోనో.. సంచలన ప్రకటనలతోనో తరచూ వార్తల్లో కనిపించే ఈ సీనియర్ నేతకు సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాల్ని చెబుతుంటారు.
కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు.. పార్టీ అధినేతకు అత్యంత సన్నిహితుడిగా ఉండి కూడా.. ఎలాంటి పదవి చేపట్టని తీరును తరచూ ప్రస్తావిస్తారు. అదేమంటే.. తాను పార్టీకి విధేయుడిగా ఉంటానని.. అందుకు బహుమతిగా తనకు పదవులు అక్కర్లేదన్న మాట ఆయన చెబుతుంటారని చెబుతారు. ఈ కారణంతోనే.. అప్పుడప్పుడు నోరు జారి.. గీత దాటినట్లు మాట్లాడినా అధినాయకత్వం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోరని చెబుతారు.
పార్టీ అధినేతకు అత్యంత సన్నిహితంగా ఉంటూ.. నిజాయితీగా ఫీడ్ బ్యాక్ ఇచ్చే కొద్దిమందిలో డిగ్గీ రాజా ఒకరన్న పేరుంది. సీనియర్ నేతగా కొన్ని విషయాల్లో ఆయన కటువుగానే ఉంటారని చెప్పాలి. అలాంటి ఆయన ఇప్పుడు సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది మామూలు వ్యక్తి కాదు. అధికారపక్షానికి అత్యంత సన్నిహితంగా ఉండే నేత కావటంతో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
డిగ్గీ పై సంచలన వ్యాఖ్యల్ని చేసింది విశ్వహిందూ పరిషత్ కార్యనిర్వాహఖ అధ్యక్షుడు అలోక్ కుమార్. ఇటీవల డిగ్గీ రాజా మాట్లాడుతూ.. బీజేపీ.. భజరంగ్ దళ్ కు చెందిన కొందరు నేతలు పాక్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ తరఫున పని చేస్తున్నట్లుగా చెప్పి సంచలనంగా మారారు.
అయితే.. డిగ్గీ రాజా చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని.. ఆయన తప్పుడు ప్రకటనలు చేస్తున్నట్లుగా అలోక్ ఆరోపించారు. ప్రజల్ని తప్పుదారి పట్టించే ఈ తరహా వ్యాఖ్యలపై శిక్షించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయటం వల్ల దేశంలో వాతావరణం దెబ్బ తింటుందన్న అలోక్.. రివర్స్ లో డిగ్గీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
డిగ్గీ చేసిన వ్యాఖ్యలపై ఆయన పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. తప్పుడు ప్రకటనలు చేస్తున్న డిగ్గీను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరీ.. విషయం రానున్న రోజుల్లో ఎంత వరకూ వెళుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.