ఆర్బీఐ స్పెషల్... ఈ 100 నోటు విలువ రూ.56 లక్షలు!

తాజాగా అలాంటి ఘటనే జరిగింది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన ప్రత్యేక కరెన్సీ ఈ సరికొత్త రికార్డ్ సృష్టించింది.

Update: 2025-01-09 04:19 GMT

ఓ 10 రూపాయల నోటు రూ.6.90 లక్షలకు అమ్ముడైతే.. ఇదే సమయంలో ఓ 100 రుపాయల నోటు ఏకంగా రూ.56 లక్షలకు పైగా విలువ పలికితే..? అదెలా సాధ్యం అంటారా? చారిత్రాత్మక వస్తువుల వేలంలోనే ఇది సాధ్యం! తాజాగా అలాంటి ఘటనే జరిగింది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన ప్రత్యేక కరెన్సీ ఈ సరికొత్త రికార్డ్ సృష్టించింది.


అవును... పురాతన వస్తువులు, సెలబ్రెటీలకు సంబంధించిన వస్తువులు, చారిత్రాత్మకమైన కళాఖండాలను తరచూ వేలం వేస్తుంటారనే సంగతి తెలిసిందే. కొన్ని సందర్భాల్లో ఆ వస్తువులు ఎవరూ ఊహించని ధరలకు అమ్ముడవుతుంటాయి.. సరికొత్త రికార్డులు సృష్టిస్తుంటాయి. ఈ క్రమంలో... భారత కరెన్సీకి చెందిన 100 నోటు ఇప్పుడు లక్షలకు అమ్ముడై రికార్డ్ క్రియేట్ చేసింది.

వివరాళ్లోకి వెళ్తే.. 1950లో హజ్ యాత్ర కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే భారతీయ యాత్రికుల కోసం ఓ ప్రత్యేక కరెన్సీని విడుదల చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీన్నీ "హజ్ నోట్" అని పిలుస్తారు. అయితే... లండన్ లో ఇటీవల జరిగిన వేలంలో ఈ 74 ఏళ్ల భారత కరెన్సీ నోటు అర కోటి రూపాయలకు పైనే పలికింది.

ఇందులో భాగంగా.. ఈ 74 ఏళ్ల నాటి రూ.100 నోటు రు.56,49,650 కు అమ్ముడైంది. ఈ నోట్లు సాధారణ భారతీయ నోట్లకు భిన్నంగా ఉంటుంది. ఈ నోట్లు దుబాయ్, కతర్, కువైట్, బహ్రెయిన్, ఒమన్ వంటి గల్ఫ్ దేశాలలో చట్టబద్దం అయినప్పటికీ.. భారత్ లో మాత్రం చెల్లవు! వీటిని ఆర్బీఐ 1970లో పూర్తిగా నిలిపివేసింది.

ఇదే సమయంలో... ఈ వేలంలో రెండు అరుదైన 10 రూపాయల నోట్లు కూడా భారీ ధరకు అమ్ముడవ్వడం గమనార్హం. ఇందులో భాగంగా.. ఓ 10 రూపాయల నోటు రూ.6.90 లక్షలకు అమ్ముడుపోగా.. మరో నోటు రూ.5.80 లక్షలకు అమ్ముడైంది.

Tags:    

Similar News