అమెరికాలో మ‌న యువ‌తి అనుమానాస్ప‌ద మృతి

Update: 2020-01-28 16:43 GMT
అమెరికాలో మ‌రో భార‌త సంత‌తి యువ‌తి అనుమాన‌స్ప‌దంగా మృతి చెందింది. ఇండియానా రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ నాట్రెడామెలో గ్రాడ్యుయేషన్ కోర్సు చదువుతున్న భారతీయ సంతతికి చెందిన ఆన్రోస్ జెర్రీ అనే యువతి క‌న్నుమూసింది. ఒక 21 ఏళ్ల యువతి మృతదేహం యూనివర్సిటీ క్యాంపస్‌లోని చెరువులో లభించింది. ఆమె శరీరం పైన ఎటువంటి గాయాలు లేవని - ప్రమాదవశాత్తు చెరువులో పడి ఆమె మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

జనవరి 21వ తేదీ నుంచి కనపడడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. అన్రోస్‌ ను ఎవరైనా చంపేసి లేక్‌ లో పడేసి ఉంటారా? లేక ఆమెనే ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందిందా? అనే విషయాన్ని తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. కేరళకు చెందిన జెర్రీ బ్లెయిన్ హైస్కూల్‌ లో చదువుకుని సైన్స్, బిజినెస్‌లో యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తోంది. పియానోతో పాటు ఫ్లూట్ వాయించడంలో నిష్ణాతురాలైన జెర్రీ యూనివర్సిటీలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేదని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ ఏడాది గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత దంత వైద్యం కోర్సు చదవాలని ఆమె ఆశించినట్లు అధికారులు తెలిపారు.



Tags:    

Similar News