హైకోర్టు మాజీ జడ్జిపై ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు

Update: 2020-08-14 05:00 GMT
ఇటీవల బయటకు వచ్చిన ఆడియో టేప్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు..దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఏపీలో హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్ వంగాల ఈశ్వరయ్య మాట్లాడినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలపై తాజాగా ఏపీ హైకోర్టు స్పందించింది. సంచలన ఆదేశాల్ని జారీ చేసింది. మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య పై మరో న్యాయమూర్తి  రామకృష్ణ పిటిషన్‌ పై విచారణ జరిపిన హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈశ్వరయ్యపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణకు ఆదేశించారు.

ఇందుకు గాను విచారణ అధికారిగా మాజీ న్యాయమూర్తి ఆర్ వి రవీంద్రన్ ను కోర్టు నియమించింది. ఈయనకు సీబీఐ.. సెంట్రల్ విజిలెన్స్ అధికారులు కూడా సహకరించాలని కోరింది. ఈ కేసుల వెనుక ఉన్నకుట్రను ఛేదించాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో నివేదిక అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

న్యాయమూర్తులపై కుట్ర జరుగుతుందన్న విషయాన్ని హైకోర్టు నమ్ముతుందా? ఇలాంటి పరిస్థితి దేశంలో మరెప్పుడైనా జరిగిందా? లాంటి పలు ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాయి. మొత్తంగా మాజీ జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో టేపులోని అంశాల మీద చర్చ ఇప్పట్లో తగ్గేలా కనిపించని పరిస్థితి ఉందని చెబుతున్నారు.


Tags:    

Similar News