`అదృష్టం బాగోకపోతే అరటి పండు తిన్నా పన్ను ఇరుగుద్ది`....జులాయి సినిమాలో త్రివిక్రమ్ రాసిన ఈ డైలాగ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత పరిస్థితికి కరెక్ట్ గా సూట్ అవుతుందేమో. కొంతకాలంగా ట్రంప్ ఏది పట్టుకున్నా మసే అన్న రీతిలో పరిస్థితులు మారిపోయాయి. కరోనాను ట్రంప్ లైట్ తీసుకోవడం వల్లే నేడు అమెరికాలో కరోనా మరణ మృదంగం కొనసాగుతోందని మెజారిటీ అమెరికన్లు భావిస్తున్నారు. దానికి తోడు హెచ్ 1బీ వీసాలతోపాటు అమెరికాలో విదేశీయులకు సంబంధించిన పలు నిబంధనలను ట్రంప్ కఠినతరం చేయడంపై కూడా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండడం....పలు సర్వేల్లో డెమొక్రాట్ల అభ్యర్థిగా బరిలో ఉన్న బైడెన్ ముందంజలో ఉండడం ట్రంప్ నకు మింగుడు పడడం లేదు. ఇక, రాబోయే ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తోన్న కమలా హారీస్ పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు బూమరాంగ్ అయ్యాయి.
తాజాగా, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు తాజాగా ట్రంప్ నకు వ్యతిరేకంగా మరో అంశం తెరపైకి వచ్చింది. విషయం పాతదే అయినా....తాజాగా దానికి సంబంధించిన నివేదిక తాజాగా వెల్లడి కావడం ట్రంప్ నకు ప్రతికూలంగా మారిందని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం వెనుక రష్యా పాత్ర ఉందని తాజాగా అమెరికా సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీ తేల్చడం ట్రంప్ నకు ఇబ్బందికరంగా మారింది. 2016 ఎన్నికల్లో ట్రంప్ నకు అనుకూలంగా రష్యా పనిచేసేందుకు తీవ్రంగా ప్రయత్నించిందని అమెరికా సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీ తేల్చింది. కానీ, ట్రంప్ మీద ఆ కమిటీ ఎటువంటి అభియోగాలు మోపకపోవడం మాత్రమే ట్రంప్ కు సంతోషం కలిగించే విషయం.
2016 ఎన్నికల సమయంలో రష్యా ఇంటెలిజెన్సు సర్వీసెస్ కు చెందిన వ్యక్తులతో ట్రంప్ ప్రచార వ్యూహకర్తలు పలుమార్లు సమావేశం అయ్యారని ఆరోపణలు వచ్చాయి. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారని 13 మంది రష్యన్ల బృందంపై ఎఫ్ బీఐ అభియోగాలు నమోదు చేసింది. అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక అధికారి రాబర్డ్ ముల్లర్ ఈ ఆరోపణలు చేశారు. ఈ రష్యన్ బృందంలోని సభ్యులు హిల్లరీపై విద్వేషం వెదజల్లే సందేశాలను వ్యాప్తి చేశారని, అదే సమయంలో ట్రంప్ నకు మద్దతిచ్చే కార్యక్రమాలకూ సహకరించారని అభియోగపత్రంలో ఎఫ్ బీఐ పేర్కొంది. ప్రాజెక్ట్ లక్తా' పేరుతో ఆ బృందం కోటి డాలర్ల బడ్జెట్‌ను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ముల్లర్ తన విచారణలో భాగంగా ఇప్పటికే ట్రంప్ మాజీ ప్రచార మేనేజర్ పౌల్ మన్‌ఫోర్ట్‌పై హవాలా విధానంలో డబ్బు వినియోగించారని, ఉక్రెయిన్‌తో మోసపూరితంగా వ్యవహరించారని అభియోగాలు నమోదు చేశారు.
ట్రంప్ వ్యాపార సహచరుడు రిట్ గేట్స్‌పై కూడా హవాలా రూపంలో డబ్బు వినియోగించారని కూడా కేసు నమోదైంది. ట్రంప్ మాజీ ముఖ్య వ్యూహకర్త స్టీవ్ బానన్‌ను కూడా ముల్లర్ విచారించారు. ఈ దర్యాప్తులో ట్రంప్ జోక్యం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే, తాను అధ్యక్షుడి రేసులో ఉంటానని 2014లో ప్రకటించక ముందే అమెరికా వ్యతిరేక ప్రచారాన్ని రష్యా ప్రారంభించిందని ట్రంప్ ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆ దేశ అధికారులు కూడా ఖండించారు. ఈ నేపథ్యంలోనే అమెరికా సెనెట్ ఇంటెలిజెన్స కమిటీ తాజా నివేదిక ట్రంప్ నకు ప్రతికూలంగా మారిందని... ట్రంప్ నకు ముందుంది మొసళ్ల పండగేనని చెప్పవచ్చు.