జేసీ ప్రభాకర్ రెడ్డి కేసులో మరో ట్విస్ట్ ...ఏంటంటే !

Update: 2020-06-16 06:00 GMT
ఏపీలో సంచలనంరేపిన జేసీ ప్రభాకర్ రెడ్డి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా అనంతపురం వన్‌ టౌన్‌ పోలీసులు మూడు కేసులకు సంబంధించి జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్‌ రెడ్డిలపై కోర్టులో పీటీ వారెంట్ ‌(క్రైం నెంబర్‌ 33) వేశారు.

గతేడాది జఠాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తుక్కు కింద బీఎస్‌ 3 వాహనాలను కొనుగోలు చేశారు. తప్పుడు ఇన్‌ వాయిస్ ‌లతో తుక్కు కింద కొనుగోలు చేసిన ఆ వాహనాలను నాగాలాండ్‌ రాజధాని కొహిమా.. అనంతపురం, ఇతర రాష్ట్రాల్లో బీఎస్‌ 4 వాహనాలుగా రిజిస్ట్రేషన్‌ చేయించారు. అనంతపురంలో రిజిస్ట్రేషన్‌ చేయించిన 80 వాహనాలపై రవాణా శాఖాధికారులు వన్‌ టౌన్‌ లో ఫిర్యాదు చేశారు. ఆ కేసులకు సంబంధించి వన్‌ టౌన్‌ పోలీసులు కోర్టులో పీటీ వారెంట్ ‌ను వేశారు.

కడప జైలులో ఉండగానే పోలీసులు పీటీ వారెంట్‌ నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మెజిస్ట్రేట్‌ పీటీ వారెంట్ ‌పై విచారణ మంగళవారానికి వాయిదా వేశారు. జేసీ ప్రభాకర్‌ రెడ్డి, జేసీ అస్మిత్‌ రెడ్డిల బెయిల్ ‌కు సంబంధించి సోమవారం ఆన్ ‌లైన్ ‌లో దరఖాస్తు దాఖలైంది. రెండు బస్సులకు సంబంధించి నకిలీ పోలీసు క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ తో ఎన్ ‌ఓసీ పొందిన కేసులో ఈ నెల 13న ఏ2 జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఏ6 జేసీ అస్మిత్‌ రెడ్డిలకు మెజిస్ట్రేట్‌ 14 రోజుల పాటు రిమాండ్‌ విధించారు. ఈ క్రమంలో వన్‌ టౌన్‌ పోలీసులు వారిని కడప కారాగారానికి తరలించారు.
Tags:    

Similar News