భారత్ పైనే సైబర్ దాడులు ఎక్కువా ?

Update: 2022-05-02 03:55 GMT
ప్రపంచం మొత్తం మీద భారత్ లోని విద్యారంగంపైనే సైబర్ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రపంచంలోని విద్యారంగంపై ఎక్కువ దాడులు భారత్ లోనే జరుగుతున్నట్లు సింగపూర్ కు చెందిన క్లౌడ్ ఎస్ ఈకే అనే సంస్ధ చేసిన అధ్యయనంలో తేలిందట. భారత్ తర్వాత అత్యధిక దాడులు జరిగింది అమెరికా, బ్రిటన్, ఇండోనేషియా, బ్రెజిల్ దేశాల్లోనే అని ఈ సంస్ధ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాల దాడుల ముప్పు, డేటా లీక్స్, ఐడెంటిటి చౌర్యాలపై సింగపూర్లోని సంస్థ నిరంతరం పనిచేస్తుంటుంది.

సైబర్ దాడులకు లక్ష్యంగా మారటానికి కోవిడ్ సమయంలో ఆన్ లైన్ విద్యాబోధనకు మారటం, విద్యారంగం డిజిటలీకరణ, ఆన్ లైన్ శిక్షణ వేదికలు విస్తృతంగా ఏర్పాటవ్వటం లాంటి కారణాలతో సైబర్ దాడులకు అవకాశాలు బాగా పెరిగిపోయినట్లు సింగపూర్ సంస్ధ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 2021 మొదటి మూడు నెలలతో పోలిస్తే 2022లో మొదటి మూడునెలల్లో 20 శాతం సైబర్ దాడులు పెరిగినట్లు తమ అధ్యయనంలో తేలిందన్నారు.

గత సంవత్సరం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జరిపిన అధ్యయనంలో సైబర్ ధ్రెట్స్ కు సంబంధించి 58 శాతం భారత్ విద్యాసంస్ధలు, ఆన్ లైన్ వేదికలే టార్గెట్ గా జరిగినట్లు తేలిందన్నారు.  కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలోని చాలా దేశాల విద్యారంగాల రూపురేఖలు మారిపోయాయట. పిల్లలు విద్యా సంస్ధలకు వెళ్ళి చదువుకునే పరిస్థితులు లేదు. అందుకనే విద్య సంస్థల యాజమాన్యాలు, లేదా ప్రభుత్వాలు విద్యార్థులకు ఆన్ లైన్ బోధనను అందుబాటులోకి తెచ్చింది.

ఈ విధానం సైబర్ దాడులకు అవకాశంగా మారినట్లు సదరు సంస్ధ ఆందోళన వ్యక్తం చేసింది. ఆన్ లైన్-ఆప్ లైన్ విద్యాబోధన వ్యాపారం 2025 నాటికి 7.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశముందని సింగపూర్ సంస్ధ అంచనా వేసింది. ఇంత భారీగా ఆదాయం వస్తోంది లేదా పెరుగుతోంది కాబట్టే సహజంగా సైబర్ నేరగాళ్ళ దృష్టి ఆన్ లైన్ విద్యారంగంపై పడిందని సంస్ధ అభిప్రాయపడింది.

సైబర్ దాడుల నుండి తప్పించుకోవాలంటే ఎప్పటికప్పుడు పాస్ వర్డులు మార్చేసుకోవటం, పాస్ వర్డ్ లను పసిగట్టడానికి వీల్లేకుండా సంక్లిష్టంగా పెట్టుకోవటం, నెట్ వర్క్, సెక్యూరిటిని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవటమే మార్గమని కూడా కౌడ్ ఎస్ ఈ కే సంస్ధ తెలిపింది.
Tags:    

Similar News