లాక్‌డౌన్ పొడ‌గింపున‌కు ఆ ఘ‌ట‌నే కార‌ణం

Update: 2020-05-02 06:15 GMT
లాక్‌డౌన్ రెండో ద‌శ ముగియ‌కముందే కేంద్ర ప్ర‌భుత్వం గ‌తానికి భిన్నంగా లాక్‌డౌన్ పొడిగిస్తున్న‌ట్లు నిర్ణ‌యించింది. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతుందా లేదా అనే దానిపై వారం రోజులుగా తీవ్ర ఉత్కంఠ ఉన్న స‌మ‌యంలో శుక్ర‌వారం సాయంత్రం లాక్‌డౌన్ పొడిగిస్తున్న‌ట్లు, మే 17వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని ప్ర‌క‌టించింది. దీంతో దేశ ప్ర‌జ‌లు షాక్‌కు గుర‌య్యారు. అయితే కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ పొడ‌గించాల‌ని ముందే నిర్ణ‌యించిన‌ట్లు.. అందుకే అక‌స్మాత్తుగా ప్ర‌క‌ట‌న జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ పొడ‌గింపు అనేది ముఖ్య‌మంత్రుల వీడియో కాన్ఫ‌రెన్స్‌లోనే స్ప‌ష్ట‌త వ‌చ్చింద‌ని స‌మాచారం. ముఖ్య‌మంత్రులంతా లాక్‌డౌన్ పొడ‌గించాల‌ని కోర‌డంతో ఆ మేర‌కు కేంద్ర ప్రభుత్వం తీవ్ర మ‌ల్ల‌గుల్లాలు ప‌డి చివ‌ర‌కు లాక్‌డౌన్ వైపే మొగ్గు చూపింది.

అయితే లాక్‌డౌన్ పొడిగిస్తారు అని చాలామంది ఊహించ‌లేదు. కేవ‌లం రెడ్ జోన్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించి మిగ‌తా ప్రాంతాల్లో స‌డ‌లింపులు ఇస్తార‌ని భావించారు. లాక్‌డౌన్ పొడ‌గింపు లేకున్నా తీవ్ర ఆంక్ష‌ల‌ను అమ‌లుచేస్తార‌ని ఊహించారు. కానీ వాటికి భిన్నంగా దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ రెండు వారాల పాటు అమ‌లుచేస్తామ‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం పెద్ద కార‌ణ‌మే ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం రంజాన్ మాసం ప్రారంభ‌మైంది. సాధార‌ణంగా ఆ వ‌ర్గానికి చెందిన వారు సామూహిక ప్రార్థ‌న‌లు నిర్వ‌హిస్తారు. రంజాన్ స‌మ‌యం కాబ‌ట్టి రోజులో త‌ప్ప‌నిస‌రిగా వీలైన‌న్ని సార్లు ప్రార్థ‌న‌లు సామూహికంగా చేస్తారు. అయితే ప్ర‌స్తుతం లాక్‌డౌన్ పొడిగిస్తే తిరిగి ప్రార్థ‌న‌లు, మ‌త కార్య‌క్ర‌మాల‌కు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని భావించి ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని ప‌లువురు చెబుతున్నారు. అయితే లాక్‌డౌన్ పొడిగింపులో ఇదొక కార‌ణం మాత్ర‌మే.

ఆ కార‌ణం వాస్త‌వంగా భావించ‌వ‌చ్చు. ఎందుకంటే మార్చి రెండోవారంలో ఢిల్లీలో మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌లు ఎంత ప్ర‌భావం చూపాయో చూశాం. ఆ ప్రార్థ‌న‌లతోనే దేశంలో క‌రోనా క‌ల్లోలం సృష్టించ‌డానికి కార‌ణం. దాన్ని గుణ‌పాఠంగా భావించింది. ఈ స‌మ‌యంలో లాక్‌డౌన్ ఎత్తేస్తే కోట్ల మంది మ‌సీదుల‌కు వెళ్లి ప్రార్థ‌న‌లు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. ఆ స‌మ‌యంలో ఎవ‌రికో ఒక‌రికి తెలియ‌కుండా క‌రోనా ఉంటే అది మ‌ళ్లీ దేశ‌వ్యాప్తంగా ప్ర‌బ‌లే ప్ర‌మాదం పొంచి ఉంది. అందుకే అన్ని విధాల ఆలోచించి.. అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని లాక్డౌన్ పొడ‌గించేందుకు కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది.

లాక్‌డౌన్ పొడిగిస్తే దేశం ప్ర‌మాదంలో ప‌డుతుంద‌ని, ఆర్థిక సంక్షోభం త‌లెత్తుతుంద‌ని.. ఆక‌లి చావులు సంభ‌విస్తాయ‌ని ఎంతోమంది హెచ్చ‌రించినా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ఆరోగ్యం దృష్ట్యా లాక్‌డౌన్ పొడిగింపున‌కే మొగ్గు చూపించి ఆ మేర‌కు నిర్ణ‌యం వెలువ‌రించింది. అయితే ఇచ్చిన స‌డ‌లింపుల‌తో కొంత ప‌రిస్థితి మెర‌గ‌య్యే అవ‌కాశం ఉంది. గ్రీన్‌, ఆరెంజ్‌, రోడ్ జోన్ల విభ‌జ‌న‌, ఆయా ప్రాంతాల్లో అక్క‌డి ప‌రిస్థితుల‌ను అనుస‌రించి స‌డ‌లింపులు ఇవ్వ‌డం స‌ముచిత నిర్ణ‌యంగా అంద‌రూ పేర్కొంటున్నారు.
Tags:    

Similar News