చేతులు కలిపిన బాబు...పవన్...పొత్తులు పొడిచినట్లే!

Update: 2022-10-18 10:39 GMT
ఏపీలో రాజకీయ ముఖచిత్రం మారుతుంది అని పవన్ కళ్యాణ్ కొద్ది సేపటి క్రితం మంగళగిరిలోని తన పార్టీ ఆఫీసులో పార్టీ కార్యకర్తలతో చేసిన ప్రసంగం తరువాత ఒక అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కోసం ఆయన బస చేసిన హొటల్ కి నేరుగా  రావడం విశేషం. దీంతో ఏపీలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోయాయని అంటున్నారు.

పవన్ ఇప్పటిదాకా పొత్తుల గురించి ఎక్కడా మాట్లాడలేదు. పైగా జనసేనగా సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో విశాఖకు పవన్ రావడం, అక్కడ ఎయిర్ పోర్టు ఘటన నేపధ్యంలో జనసేన నేతల మీద అరెస్టులు, పవన్ ని  నిర్బంధించడం వంటివి చకచకా సాగాయి.

దీంతో పవన్ కి సంఘీభావంగా ఫోన్ లో మద్దతు ప్రకటించిన చంద్రబాబు ఇపుడు విజయవాడలో బసచేసి ఉన్న పవన్ వద్దకు నేరుగా వచ్చారు. ఒక విధంగా చూసే ఈ భేటీ ఏపీ రాజకీయాలను మలుపు తిప్పుతుంది అని అంటున్నారు. 2017లో  పవన్ కళ్యాణ్ తెలుగుదేశం మీద విమర్శలు చేస్తూ విడిపోయారు. ఆ తరువాత మళ్లీ దాదాపు అయిదేళ్ళ తరువాత ఇద్దరు నాయకుల మధ్య సమావేశం జరిగింది అనుకోవాలి.

అంతే కాదు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు ఓట్లు చీలకుండా పొత్తులు పెట్టుకుంటామని తన పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఈ భేటీ అని అంటున్నారు. ఎప్పటి నుంచో ఈ రెండు పార్టీలు కలుస్తాయి అని అంతా అనుకుంటున్నదే. మొత్తానికి విశాఖ సంఘటన నేపధ్యంలో పరామర్శకు బాబు రవడం అంటే కచ్చితంగా పొత్తులకు ఇది బీజం వేస్తుంది అని అంటున్నారు.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని బరిలోకి దిగే మాత్రం అది కచ్చితంగా వైసీపీకి పెను సవాల్  గానే చూడాలని అంటున్నారు. మొత్తానికి విశాఖ గర్జన కాదు కానీ తదనంతరం పరిణామాలు మాత్ర్రం ఏపీ రాజెకేయ ముఖచిత్రాన్ని మార్చే దిశగానే సాగుతున్నాయని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News