ఐపీఎల్ : కడప కుర్రాడిని వెంటాడిన దురదృష్టం .. ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఇంటికి !
ఐపీఎల్ 2021 .. మధ్యలోనే ఆగిపోయింది. కడప జిల్లా నుండి ఐపీఎల్ టోర్నమెంట్ లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నయంగ్ క్రికెటర్ మారంరెడ్డి హరిశంకర్ రెడ్డికి దురదృష్టం వెంటాడింది. ఈ మెగా టోర్నమెంట్ కు ఎంపికైనప్పటికీ.. అర్ధాంతరంగా వెనుదిరగాల్సి వచ్చింది. ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ దీన్ని అర్ధాంతరంగా వాయిదా వేయడమే దీనికి కారణం.
22 సంవత్సరాల మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి స్వస్థలం రాయచోటి. కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్. తొలివిడత మినీ ఐపీఎల్ వేలంపాటలో ఆయనకు ఛాన్స్ లభించింది. చెన్నై సూపర్ కింగ్స్ కు అతను ఎంపికయ్యాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన చెన్నైలోని గ్రాండ్ చోళ హోటల్ వేదికగా సాగిన వేలంపాటలో హరిశంకర్ రెడ్డిని సొంతం చేసుకుంది ధోనీ సేన. మారంరెడ్డి బేస్ ప్రైజ్ 20 లక్షల రూపాయలు. అదే మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్ అతణ్ని జట్టులోకి తీసుకుంది. ఇప్పటిదాకా మారంరెడ్డి 13 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కిందటి నెల 15వ తేదీన ముంబైలో పుదుచ్చేరి టీమ్ మీద 35 పరుగులకు మూడు వికెట్లను తీసుకున్నాడు. కొంతకాలంగా అతను దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్నాడు. ఆ అనుభవంతోనే ఐపీఎల్ మినీ ఆక్షన్ లో ఎంట్రీ లభించింది. అదృష్టం అతని తలుపు తట్టింది. ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్ వంటి అంతర్జాతీయ క్రికెటర్లు ఐపీఎల్ లో చోటు దక్కించుకోవడంలో విఫలమైన చోట, హరిశంకర్ రెడ్డికి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటిదాకా ఏడు మ్యాచ్ లను ఆడింది. ఈ ఏడింటిలోనూ అతనికి తుదిజట్టులో చోటు దక్కలేదు. డగౌట్ కే పరిమితమయ్యాడు. ఇప్పుడు కరోనా కారణంగా టోర్నీ వాయిదా వేయడంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే వెనక్కి తిరగాల్సిన పరిస్థితి వచ్చింది.