ఇప్పుడు అందరివీ ఉరుకులు, పరుగుల జీవితాలు. ఏ రోజు, ఏ గంటలో ఏమేం చేయాలో ముందే రాసిపెట్టుకుని యంత్రాల్లా గడిపేస్తున్నారు. ఒంట్లో శక్తి అంతా హరించుకుపోయి.. మనసులో గంపెడన్ని ఆందోళనలతో.. నిద్రకూడా సరిగా పట్టని పరిస్థితి. కాసేపు విశ్రాంతి తీసుకుంటే, మళ్లీ రీఫ్రెష్ అయిపోతామని అంటుంటారు. కానీ అది జస్ట్ రిపేర్ చేసుకోవడం మాత్రమేనని శాస్త్రవేత్తలు, వైద్యులు స్పష్టం చేస్తున్నారు. శరీరానికి పునరుత్తేజం రావాలంటే, కాస్త లేజీనెస్ అలవర్చుకోవాలని చెప్తున్నారు. .ఏంటా బద్ధకం?.. బద్దకం దరిద్రం.. అలా మంచం పట్టుకుని ఎంత సేపు నిద్రపోతావ్.. బద్ధకంగా ఎక్కడ పడితే అక్కడే అలా ఉండకు.. అంటూ పెద్దలు తిడుతుంటారు. కానీ బద్దకం కూడా మంచిదేనంటున్నా సైంటిస్టులు. రీ ఫ్రెష్ అవ్వటానికి బద్దకం కూడా మంచిదేనంటున్నారు. లేజీ సో క్రేజీ అంటున్నారు. ఈరోజు ఆగస్టు 10. ‘నేషనల్ లేజీ డే’.
ప్రస్తుతం బిజిబిజీ లైఫ్ లే. రోజు ఉన్న 24 గంటలూ సరిపోవట్లేదు. ఎవ్వరు చూసినా ఉరుకులు పరుగులు.ఉదయం అనగా మొదలు పెడితే రాత్రి పడుకునేవరకూ బిజి బిజీ. కానీ కొందతమంది బద్దకం రాయుళ్లు మత్రం ఎప్పుడూ బెడ్ మీదనో, లేదా సోఫాలోనో, లేదా ఏదన్నా చైర్ లోనే కూర్చుని లేజీగా గంటలు గంటలు నిమిషాల్లా గడిపేస్తుంటారు. ఏదో పని కానిచ్చేశాం అన్నట్లుగా చేసి పారేసి మళ్లీ మళ్లీ రెస్ట్ మోడ్ లోకి వెల్లిపోతుంటారు. ఇటువంటివారిని ముద్దుగా మనం సోమరిపోతులు అని అంటుంటాం.
ఒత్తిడి..తద్వారా అనారోగ్యాలు. ఆస్పత్తుల వెంట పరుగులు. అంతే తప్ప కాసేపు ప్రశాంతంగా ఉంట రీఫ్రెష్ అవుతామనే ధ్యాసే లేకుండాపోతోంది. ఒకవేళ అటువంటి ఆలోచన వచ్చినా చేయాల్సిన పనులు గుర్తుకొచ్చి ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు. లేదా పోని బద్ధకిద్దాం.. కాసేపున్నాక చేసుకుందాం..రేపు చేసుకుందాం..అనేదే లేదు. దీంతో నిద్ర మాట ఎలా ఉన్నా అలసట. ఆందోళన..తద్వారా వచ్చే అనారోగ్యాలు తప్ప మరేమీ ఉండవు. కానీ కాసేపు విశ్రాంతి తీసుకుంటే.. మళ్లీ ‘రీఫ్రెష్’ అయిపోతామని అంటుంటారు సైంటిస్టులు. కానీ అది జస్ట్ ‘రిపేర్’ చేసుకోవడం మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. శరీరానికి పునరుత్తేజం రావాలంటే.. కాస్త ‘లేజీనెస్’ అలవర్చుకోవాలని సూచిస్తున్నారు.
విశ్రాంతి అంటే కాసేపు నిద్రపోవడమో.. లేకుంటే సినిమా, షికారు వంటి పనులు పెట్టుకోవడమో చేయటం కాదు..అలా చేస్తే విశ్రాంతి తీసుకున్నట్లుగా ఎలా అవుతుందంటున్నారు. అందుకే కాస్త ‘లేజీనెస్’ అలవాటు చేసుకోండీ అంటున్నారు. అంటే..మరీ రోజుల తరబడి పనులు మానేసి మంచానికి అతుక్కుపోవటం కాదు. ఆలోచనలు, ఆందోళనలు, సమస్యలు అన్నీ పక్కనపడేసి..ప్రశాంతంగా ఉండటం. అంటే కాస్త లేజీగా ఉండటం. ఆ సమయంలో నచ్చిన ఫుడ్ తింటూ మీకు నచ్చినట్టుగా సోఫాలోనో, బెడ్ మీదో బద్ధకంగా పడిపోవడం..పడుకుండిపోవటం అని చెప్తున్నారు.
బద్ధకంగా గడపడం కూడా ఒక రకంగా చికిత్స వంటిదేనని.. శరీరాన్ని, మనసును పూర్తిస్థాయిలో పునరుత్తేజితం చేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. లేజీగా గడపడం కోసం.. సమయం వృధా చేస్తున్నామనుకోవటం ఒకటి కాదంటున్నారు. లేజీగా ఉండాలన్నారు కదా అని.. బద్ధకాన్ని అలవాటుగా మార్చుకూడదు. బద్దకం అనేది ఓ స్థాయి దాటితే ప్రమాదమే. జీవితంలో మనకు అవసరమైన వాటిపైనా నిర్లక్ష్యం చేసేలా బద్దకం ఉండకూదంటున్నారు. చాలా రకాల చెడు అలవాట్లకు కారణాల్లో సోమరితనం కూడా అనే విషయం మర్చిపోకూడదు. బద్దకం అనేది రీఫ్రెష్ మెంట్ కోసమే తప్ప అసవరమైనవి కూడా చేయకుండా ఉండటం కాదు. కేవలం ‘రీఫ్రెష్’ కావడానికి మాత్రమే లేజీనెస్‌ను పరిమితం చేయాలనే విషయాన్ని ఏమాత్రం మర్చిపోవద్దంటున్నారు.
లేజీ ఉండాలనుకునే రోజును పూర్తిగా మీకు కేటాయించుకోండి. డబ్బు, ఇతర సమస్యలైనా సరే పూర్తిగా పక్కనపెట్టేయండి. ఆందోళనలను అస్సలు పెట్టుకోవద్దు. పొద్దున్నే లేవడం, అలారం పెట్టుకోవటం అస్సలే వద్దు. రాత్రి పడుకుని ఉదయం మీకు ఇష్టమైనప్పుడు నిద్ర లేవండి. లేదా ఉదయం పడుకుని మీకు ఇష్టమైనప్పుడ లేవండి. ఆ సమయంలో హాయిగా లూజ్ గా కంఫర్ట్ గా ఉండే బట్టలు వేసుకోండీ. సోఫాలో లేదా మంచం మీకు ఇష్టమైనవాటిపై పడుకోండి లేదా కంఫర్ట్ గా కూర్చోండి. పడుకున్నా..కూర్చున్నా రిలాక్స్ గా సుఖంగా ఉండేలా చూసుకోండి. వీలైతే ఫోన్‌ను పూర్తిగా పక్కనపెట్టేయండి. ఫోన్ఉందనే విషయమే మర్చిపోండి. ఇవన్నీ మీరు మానసికంగా, శారీరకంగా పునరుత్తేజితం కావడానికి తోడ్పడతాయని సైంటిస్టులు, డాక్టర్లు చెబుతున్నారు.
సోమరితనం అనారోగ్యమని..ఊబకాయానికి కారణమనీ చాలా మంది అనుకుంటారు. కానీ ఆ ఆ ఆలోచనే తప్పు అని ‘కాంటెంపరరీ సైకోఅనలైసిస్ గ్రూప్’కు చెందిన సైకాలజిస్టు లారా మిల్లర్ తెలిపారు. కొంతమంది లేజీగా కనిపించడానికి చదువు, పని, ఏదైనాగానీ తమ వల్ల కాదేమోనన్న భయం అందుకు కారణమవుతుందని వివరించారు. ఏదైనా కోల్పోవడం, కోల్పోతామన్న భయం, ఓటమి, డిప్రెషన్ వంటివి లేజీనెస్‌కు దారితీస్తాయని.. మనసులో గట్టిగా కోరుకుంటే సులువుగా బయటపడొచ్చని తెలిపారు.
ప్రపంచ కుబేరుడు..మైక్రో సాఫ్ట్ అధినేత ద గ్రేట్ బిల్ గేట్స్ కూడా లేజీగా ఉండే వ్యక్తుల్నే ఎంచుకుంటారట. లేజీ నెస్ గురించి ఆయనేమంటారంటే‘ఏదైనా కష్టమైన పని చేయాలంటే.. నేను లేజీగా ఉండే వ్యక్తినే ఎంచుకుంటానని తెలిపారు.ఎందుకంటే..కష్టమైన పనిని సులువుగా చేయగల మార్గాలను అలాంటివారే గుర్తించగలరని తెలిపారు.