కేసీఆర్ విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. షాకింగ్ ట్రీట్‌మెంట్ ఇస్తోందా? అప్పుల విష యంలో ఏపీ కన్నా.. తెలంగాణ బాగా దిగజారిందని.. కేంద్ర ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. తాజాగా వెల్లడించిన.. అప్పుల లెక్కల్లో.. ఏపీని తక్కువ చేసి చూపించారో.. లేక..ఏమో.. తెలియదు కానీ.. జనాభాతో పోల్చితే.. ఏపీ కన్నా.. తక్కువగానే ఉన్న తెలంగాణ అప్పులు చేయడంలో ముందున్నదనే భావనను మాత్రం బాగానే కల్పించారు.
ఏపీ గడిచిన మూడేళ్ల కాలంలో 4 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. తెలంగాణ ఏకంగా.. 4.5 లక్షల కోట్ల అప్పులు చేసినట్టు కేంద్రం ఇచ్చిన ప్రజెంటేషన్ స్పష్టం చేసింది. అంటే.. దీనిని బట్టి.. ఏపీ కన్నా.. తెలంగాణ పరిస్థితి దారుణంగా ఉందనేది స్పష్టంగా కనిపిస్తోంది.
కానీ, ఇది నిజమేనా? ఏపీలో చూస్తే.. ''బటన్ నొక్కుడు'' ఎక్కువగా కనిపిస్తోంది. కానీ, తెలంగాణలో అలా లేదు. పోనీ.. ఏపీ కన్నా.. తెలంగాణ అప్పులు ఎక్కువగా చేస్తోందని చెప్పినా.. ఆ అప్పుల ద్వారా వస్తున్న నిధులను దేనిపై ఖర్చు పెడుతున్నారు? అనేది ప్రశ్న.
ఏపీ పరిస్థితిని చూస్తే.. ప్రజలకు నిధులు పంచుతున్నారు. కానీ, తెలంగాణ ఈ పంపకాలు.. తక్కువగానే ఉన్నాయి. మిగిలిన నిధులను అభివృద్ధికి ఖర్చు పెడుతున్నట్టు.. ప్రభుత్వమే చెబుతోంది.
గణాంకాలు చూపిస్తోంది. రహదారుల నిర్మాణం.. నూతన ప్రాజెక్టులు, కాళేశ్వరం సహా ఇతర సాగు నీటి ప్రాజెక్టులకు మెజారిటీ నిధులు అక్కడ వెచ్చిస్తున్నారు. ఆర్థిక సూత్రాల ప్రకారం చూస్తే. అభివృద్ధిపై జరిగే.. ఎలాంటి పెట్టుబడి అయినా.. మంచిదే. కానీ, కేంద్రం మాత్రం ఈ విషయాలను పక్కన పెట్టి.. కేవలం అప్పులు చేస్తున్నారు.. అనే కోణంలోనే తెలంగాణను దోషిని చేసింది.
దీని పరమార్థం.. అంతరార్థం కూడా.. రాజకీయంగా.. తెలంగాణ సర్కారును దెబ్బతీయడమే తప్ప.. మరొక టి లేదని.. అంటున్నారు పరిశీలకులు. తెలంగాణలో పాగా వేయాలని.. గట్టిగా నిర్ణయానికి వచ్చిన బీజేపీ.. తెలంగాణపై అన్ని రూపాల్లోనూ దాడి చేస్తోందనే భావన వ్యక్తమవుతోంది. అప్పులు చూపించిన కేంద్రం అదేసమయంలో అభివృద్ధిని కూడా చూపిస్తే.. బాగుండేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. లేదు. కేవలం నాణేనికి ఒక వైపు మాత్రమే చూస్తామంటే.. ప్రజల తీర్పు ఎలానూ ఉండనే ఉంటుందని అంటున్నారు.