ఏపీ రాజకీయాల్లో సంప్రదాయాలు పలకరింపులు పద్ధతులు అన్నీ కూడా తగ్గుముఖం పడుతున్నాయన్న విమర్శలు అయితే ఒక వైపు గట్టిగానే ఉన్నాయి. అయితే అవి కాలాలతో పాటు ఎంతలా తగ్గిపోయినా కొంత నయం అనుకునేలా పరిస్థితులూ అపుడపుడు కనిపిస్తూంటాయి. ముఖ్యంగా చూసుకుంటే సీఎం జగన్ కి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఉప్పూ నిప్పులాంటి రాజకీయ బంధమే ఉందని చెబుతారు.
అయినా సరే చంద్రబాబు బర్త్ డే అయిన ఏప్రిల్ 20న జగన్ ఆయనకు విషెస్ చెబుతారు. ఇక జగన్ బర్త్ డే రోజున చంద్రబాబు కూడా అలాగే చెబుతారు. ఇది మొత్తం రాజకీయాలను గమనించేవారికి ఎపుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. నిజానికి జగన్ కి అడ్వాన్స్ గా రెండు రోజుల నుంచి దేశ విదేశాల నుంచి అభిమానుల తరఫున బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇక పుట్టిన రోజు వేళ అయితే తెల్లవారు జాము నుంచే ట్విట్టర్ ఒక్క లెక్కన మోత మోగుతోంది. సోషల్ మీడియా కూడా ఊగిపోతోంది.
అలాగే సినీ రాజకీయ రంగాల నుంచే కాదు అనేక రంగాల నుంచి అతిరధ మహారధులు వరసగా జగన్ కి విషెస్ చెబుతూ వస్తున్నారు. ప్రధాని మోడీ కూడా జగన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి సహా సినీ ప్రముఖులు అంతాబర్త్ డే విషెస్ చెప్పినా కూడా ఇంకా ఎవరో చెప్పాలని కొరిక, ఆయన చెబుతారా, చెబితే ఎలా చెబుతారు అని ఒక విధమైన ఆసక్తి అయితే అందరిలో ఉంది.
ఆయనే చంద్రబాబు. చంద్రబాబు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో తన ట్విట్టర్ ద్వారా జగన్ కి విషెస్ చెప్పారు. అయితే అది చాలా సింపుల్ గా సింగిల్ లైన్ లో ఆ విషెస్ ఉండడమే ఇక్కడ విశేషం. హ్యాపీ బర్త్ డే జగన్ అంటూ బాబు ఒక్క ముక్కలో ముగించేశారు. జగన్ కి ముందూ వెనకా ఏమీ విశేషణమైతే లేదు. ముందు ఏమి ఉండాలి అన్న డౌట్ ఉండొచ్చు. అది సీఎం అని వైఎస్ అని ఉండొచ్చు కానీ బాబు విషెష్ లో కేవలం జగన్ అని మాత్రమే ఉంది.
అయినా సరే ఇది చాలా స్పెషల్ విషెస్ గానే అంతా చూస్తున్నారు. బాబు ఇలా ట్వీట్ చేయగానే మరో వైపు వేల లైక్స్ వచ్చి పడుతున్నాయి. మరి ఇలా లైక్స్ కొట్టేవారు రాజకీయ ప్రియులా లేక టీడీపీ తమ్ముళ్లా, జగన్ అభిమానులా అన్నది తేలడం కష్టం కానీ మొత్తానికి ఈ వెరీ వెరీ స్పెషల్ విషెష్ కోసం అంతా ఎదురుచూశారు, బాబు కూడా స్పెషల్ ట్వీట్ నే చేశారు.
అదే విధంగా చూస్తే జగన్ కి జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా విషెస్ చెప్పారు. ఏపీ సీఎం జగన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి జగన్ కి వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్ ని చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.