అమ‌రావ‌తిని కాపాడు.. శ్రీవారిని మొక్కిన చంద్ర‌బాబు

Update: 2021-12-17 17:30 GMT
ఆంధ్రుల ఏకైక రాజ‌ధాని అమ‌రావ‌తిని కాపాడాలంటూ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. తిరుమ ల శ్రీవారిని ప్రార్ధించారు. ఈ రోజు తిరుప‌తి వేదిక‌గా జ‌రిగిన‌.. అమ‌రాతి రైతుల మ‌హాస‌భ‌కు.. చంద్ర‌బాబు హాజ‌ర‌య్యారు. అయితే..దీనికి ముందు ఆయ‌న తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా.. మీడియాతో చంద్ర‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలని స్వామివారిని ప్రార్ధించిన‌ట్టు చెప్పారు.

అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయ‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. మూడు రాజధానులు పెడతామని ప్రజలకు మాయమాటలు చెప్పడం స‌రికాద‌ని సీఎం జ‌గ‌న్‌కు హిత‌వు ప‌లికారు. రాష్ట్రానికి రాజధాని అమరావతి మాత్రమే ఉండాలని, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాల‌ని ఆకాంక్షించారు.  రాజధాని రైతులు 45 రోజులపాటు పాదయాత్ర పూర్తి చేసుకుని శ్రీవారిని దర్శించుకున్నారని… రైతుల పాదయాత్ర ముగింపు సభలో తాను పాల్గొంటాన‌ని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు.  

రాజ‌ధాని అమ‌రావ‌తి ఏ ఒక్కరి సమస్య కాదని పేర్కొన్న చంద్ర‌బాబు ఇది… ఐదు కోట్ల మంది ప్రజల సమస్య అని తెలిపారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం భవిష్యత్ తరాల భవిష్యత్ బాగుండేలా స్వామివారు ఆశీర్వదించాలి అని చంద్రబాబు పేర్కోన్నారు.

అయ‌తే.. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న చంద్ర‌బాబు.. 300 రూపాయల ప్రత్యేక దర్శనం‌లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్లి ఆయన శ్రీవారిని మహా లఘుదర్శనంలో స్వామివారిని దర్శించుకోవ‌డంపై.. విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆల‌య అధికారులు ఆయ‌న‌కు స‌రైన గౌర‌వం చేయ‌లేద‌ని.. టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. వాస్త‌వానికి వీఐపీ ద‌ర్శ‌న సౌక‌ర్యం ఇవ్వాల్సిన అధికారులు.. రూ.300 ప్ర‌త్యేక ద‌ర్శ‌నం ఏర్పాటు చేయ‌డంపై టీడీపీ నాయ‌కులు మండిప‌డుతున్నారు.

అయితే..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. కావాల‌నే చంద్ర‌బాబు రూ.300 ప్ర‌త్యేక ద‌ర్శ‌నం వెళ్లారా?  లేక అధికారులే ఆయ‌న‌కు వీఐపీ ద‌ర్శ‌నం క‌ల్పించ‌లేదా?  తెలియాల్సి ఉంద‌ని అంటున్నారు.
Tags:    

Similar News