సింధుకి 'పూర్' ఏపీ అదరగొట్టే నజరానా

Update: 2016-08-20 10:36 GMT
చంద్రబాబు చంద్రబాబే. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఆయన తర్వాతే. సందర్భానికి తగినట్లుగా ‘భారీ’తనానికి కేరాప్ అడ్రస్ అయిన చంద్రబాబు.. ఏపీ ఎదుర్కొంటున్న ఆర్థికగడ్డు పరిస్థితుల్ని పట్టించుకోకుండా తెలుగమ్మాయ్ సింధుకు భారీ నజరానాల్ని ప్రకటించారు. రియో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ సింగిల్స్ లో సంచలన విజయంతో రజత పతకాన్ని సొంతం చేసుకున్న సింధుకి.. తెలుగు ప్రభుత్వం ఒకటి ఇచ్చిన నజరానా భారీగా ఉండటమే కాదు.. ఆమె సాధించిన విజయానికి తగ్గట్లుగా ఉండటం గమనార్హం.

తాజాగా ఏపీ మంత్రి వర్గ సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. భారత్ కు రజత పతకం తీసుకురావటం ద్వారా తెలుగోళ్ల సత్తాను ప్రపంచానికి చాటిన సింధుకు భారీ ప్రోత్సాహాకాల్ని ప్రకటించారు. సింధుకి రూ.3కోట్ల నగదు ప్రోత్సాహకంతో పాటు గ్రూప్ 1 ఉద్యోగం.. ఏపీ రాజధాని అమరావతిలో 1000 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. ఆమెకు కోచ్ గా వ్యవహరించిన గోపీచంద్ కురూ.50 లక్షల నగదు బహుమతిని అందిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

 ఇదిలా ఉండగా.. సిందుకు ఢిల్లీ ప్రభుత్వం రూ.2కోట్లు.. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల నగదు ప్రోత్సాహం ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. మరెవరికీ అందనంత భారీగా ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు సింధుకు నజరానాను ప్రకటించటం విశేషం.ఇక.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత నజరానా ప్రకటిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News