ట్రంప్ పిడుగు... పార్ట్ టైమ్ జాబ్స్ మానేస్తున్న భారతీయ విద్యార్థులు!

ఈ నేపథ్యంలోనే బహిష్కరణ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు చాలా మంది విద్యార్థులు తమ పార్ట్ టైమ్ ఉద్యోగాలను వదులుకుంటున్నారని అంటున్నారు.

Update: 2025-01-24 07:00 GMT

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. ఇమ్మిగ్రేషన్స్ పై తన వైఖరిని స్పష్టంగా తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో... భారతీయ విద్యార్థుల్లో ఆందోళనలు పెరిగాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే బహిష్కరణ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు చాలా మంది విద్యార్థులు తమ పార్ట్ టైమ్ ఉద్యోగాలను వదులుకుంటున్నారని అంటున్నారు.

అవును... అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే వీసా, ఇమ్మిగ్రేషన్ నిబంధలను కఠినతరం చేస్తున్నామంటూ అటు ప్రపంచ దేశాలకు, ఇటు ఇప్పటికే యూఎస్ లో ఉన్న వలసదారులకు షాక్ ఇచ్చారు ట్రంప్. ఇదే సమయంలో.. ఎఫ్-1 వీసాపై వచ్చిన విదేశీ విద్యార్థులకు సంబంధించిన నిబంధనలు కఠినతరం చేశారు.

విదేశీ విద్యార్థుల పార్ట్ టైమ్ జాబ్స్ విషయంలో అమెరికాలో చాలా నిబంధనలు ఉంటాయి. ఇందులో భాగంగా.. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు క్యాంపస్ లో మాత్రమే వారానికి 20 గంటలు పని చేసే అవకాశం లభిస్తుంది. అయితే... చాలా మంది రోజువారీ ఖర్చుల కోసం బయట పార్ట్ టైం జాబ్స్ చేస్తుంటారు.

అయితే... తాజా రూల్స్ ప్రకారం ఆ బయట పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న విషయం బయటపడితే దేశం నుంచి బహిష్కరించే ప్రమాధం పుష్కలంగా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్ట్ టైమ్ జాబ్స్ కోసం ఆలోచిస్తే.. ఏకంగా అమెరికా నుంచి పంపించేస్తారనే ఆందోళన ఈ నిర్ణయానికి కారణం అయ్యిందని చెబుతున్నారు.

వాస్తవానికి.. భారతీయ విద్యార్థులు అమెరికాలోని రెస్టారెంట్లలో గ్యాస్ స్టేషన్ లలో, సూపర్ మార్కెట్స్ లో పని చేస్తుంటారు. తద్వారా వచ్చే ఆదాయంతో రోజు వారీ ఖర్చులకు సరిపోతుందని చెబుతుంటారు. అయితే... తాజాగా ట్రంప్ యంత్రాంగంపై ఆందోళన చెందుతున్న విద్యార్థులు భయంతో రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదని అంటున్నారు.

ఈ సమయంలో ప్రస్తుతానికి పార్ట్ టైమ్ జాబ్స్ ఆలోచన విరమించుకుంటున్న విద్యార్థులు కొంతమంది సేవింగ్స్ పై ఆధారపడాలని ఫిక్స్ అవుతుంటే.. మరికొంతమంది స్నేహితులు, బంధువులను అప్పులు అడుగుతున్నారని అంటున్నారు. ఇంకొంతమంది గిల్టీగా అనిపిస్తున్నా తల్లితండ్రులను అడగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు.

ఈ అనిశ్చిత పరిస్థితులు అమెరికాలోని భారతీయ విద్యార్థుల్లో చాలా మందిని మానసికంగా ప్రభావితం చేస్తోందని అంటున్నారు. మరి ఈ సమస్యలకు పరిష్కారం ఎలా దొరకబోతోందనేది వేచి చూడాలి.

Tags:    

Similar News