మీర్ పేట్ లో భార్య హత్య కేసు... తెరపైకి మరో మహిళ, వెబ్ సిరీస్!

సాదారణంగా, మెజారిటీ కేసుల్లో దంపతులు మధ్య అభిప్రాయబేధాలు వచ్చి గొడవలు స్టార్ట్ అయినప్పుడు విడాకులు తీసుకుని విడిపోవడం సంగతి తెలిసిందే.

Update: 2025-01-24 09:56 GMT

హైదరాబాద్ లోని మీర్ పేటలో భార్యను కిరాతకంగా హత్య చేసి, ముక్కలుగా నరికిన కేసు తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరికొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... గురుమూర్తి తన భార్యను అంత కిరాతకంగా హత్య చేయడానికి కారణం వివేహేతర సంబంధం అనే విషయం తెరపైకి వచ్చింది!

అవును... సాదారణంగా, మెజారిటీ కేసుల్లో దంపతులు మధ్య అభిప్రాయబేధాలు వచ్చి గొడవలు స్టార్ట్ అయినప్పుడు విడాకులు తీసుకుని విడిపోవడం సంగతి తెలిసిందే. అలా కాకుండా వీరి బంధం ఓ క్రైమ్ సంఘటనతో తెగిపోతే అందులో కచ్చితంగా వివాహేతర సంబంధం రూపంలో మూడో వ్యక్తి పాత్ర ఉండి తీరుతుందని చాలామంది చెబుతుంటారు.

ఈ నేపథ్యంలో తాజాగా మీర్ పేటలో గురుమూర్తి తన భర్యను అంత కిరాతకంగా హత్య చేసి, ముక్కలను ఉడికించి, అనంతరం ఆ ముద్దలు, పొడి చేసిన ఎముకలను సమీపంలోని చెరువులో వేసినట్లు చెబుతోన్న ఘటనలోనూ వివాహేతర సంబంధమే కీలక భూమిక పోషించినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి తెరపైకి వస్తోన్న విషయాలూ సంచలనంగా మారాయి.

వివరాళ్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన వెంకట మాధవి (35)కి అదే గ్రామానికి చెందిన గురుమూర్తి (39)తో 13 ఏళ్ల కిందట వివాహామైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆర్మీలో పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్న గురుమూర్తి... ప్రస్తుతం డీఆర్డీవో లో కాంట్రాక్ట్ సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో... రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వరనగర్ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్నేళ్లుగా తన సమీప బంధువైన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడట. ఈ విషయం భార్యకు తెలియడంతో గొడవలు జరిగాయని.. దీంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని భావించాడని తెలుస్తోంది.

ఈ సమయంలో... సంక్రాంతి సందర్భంగా తన ఇద్దరు పిల్లలను తన సోదరి ఇంటికి పంపించిన గురుమూర్తి. 13, 14 తేదీల్లో మాధవితో కలిసి ఉదయంపూట సోదరి ఇంటికెళ్లి సాయంత్రానికి తిరిగొచ్చారు. ఈ క్రమంలో... మరో మహిళతో గురుమూర్తి ఉన్న కొన్ని ఫోటోలను ఆమె చూడటంతో 15న ఉదయం ఇద్దరి మధ్య గొడవ మొదలైందట.

అప్పటికే తన భార్య అడ్డు తొలగించుకోవాలనే ఆలోచనతో ఉన్న గురుమూర్తి ఆమె తలను గోడకేసి కొట్టడంతో కిందపడిపోయిందంట. ఈ సమయంలో చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఇటీవల ఓటీటీలో చూసిన ఒక వెబ్ సిరీస్ లో ఉన్నట్లుగా.. మృతదేహాన్ని బాత్ రుమ్ లోకి తీసుకెళ్లి, ముక్కలుగా నరికి, తర్వాత వాటిని బకెట్ నీళ్లలో వేసి హీటర్ తో మరగబెట్టాడంట.

ఆ ముక్కలన్నీ మెత్తగా మారిన తర్వాత.. వాటిలో ఎముకలను వేరూ చేసి రోకలితో దంచి ముద్దగా చేశాడట్త. అనంతరం.. ఆ మాంసం ముద్ద, ఎములక పొడిని సంచుల్లో నింపి సమీపంలోని చెరువులో వేసినట్లూ చెబుతున్నారు. అయితే... చెరువులో విసిరినట్లు నిందితుడు చెబుతున్నా.. ఇంకా ఆధారాలు లభించలేదని ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ తెలిపారు.

Tags:    

Similar News