ఎలాన్ మస్క్ ఎనీ టైమ్ రిజైన్?

ప్రస్తుతం ట్రంప్ 2.0లో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్నట్లు చెబుతున్న ఎలాన్ మస్క్ కు అమెరికాలో జనాదరణ తగ్గుతోందనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.

Update: 2025-01-24 10:49 GMT

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇప్పుడు పాలిటిక్స్ లోనూ బిజీ అయిపోతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ తరుపున ప్రచారం చేయడంతో పాటు రిపబ్లికన్స్ కి అతిపెద్ద ఫండర్ అయ్యారనే కామెంట్లూ వినిపించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "డొజ్" బాధ్యతలు మస్క్ చేతుల్లో ఉన్నాయి.

ఒక్కమాటలో చెప్పాలంటే... ఇప్పుడు వైట్ హౌస్ లో ట్రంప్ తర్వాత ట్రంప్ అంతటివారు ఎలాన్ మస్క్ అని చెప్పినా అతిశయోక్తి కాదు. తాజాగా డొజ్ కు మస్క్ తో పాటు సంయుక్త సారథిగా ఉన్న వివేక్ రామస్వామి ఆ పదవి అందుకొకపోవడంలోనూ మస్క్ పాత్ర కీలకం అని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే.. తాజాగా ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.

అవును... ప్రస్తుతం ట్రంప్ 2.0లో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్నట్లు చెబుతున్న ఎలాన్ మస్క్ కు అమెరికాలో జనాదరణ తగ్గుతోందనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ఈ మేరకు ఇటీవల వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన పోల్ లో అమెరికన్ లలో మస్క్ పై అనుకూలత 40 శాతానికి పరిమితం కాగా.. అసమ్మతి 51 శాతంగా ఉందని వెల్లడైందని చెబుతున్నారు.

ఈ పోల్ ను ఈ జనవరి 09 నుంచి 14 మధ్య సుమారు 750 నమోదిత ఓటర్లతో.. టెక్స్ట్ టు వెబ్ ద్వారా ఈ సర్వే నిర్వహించినట్లు చెబుతున్నారు. దీంతో... ఈ విషయం వైరల్ గా మారింది. ట్రంప్ తీసుకునే నిర్ణయాల్లో ఎలాన్ మస్క్ పాత్ర కీలకం అనే చర్చ నేపథ్యంలో ఈ ఫలితాలు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే... డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ సమర్థత విభాగానికి నాయ్యకత్వం వహించే కొత్త పాత్రను చేపట్టడంతోనే ఎలాన్ మస్క్ పై అనుకూలతా రేటింగ్ పడిపోయిందని చెబుతున్నారు. గత ఏడాది అక్టోబర్ నెల నుంచి మస్క్ విషయంలో అమెరికన్లలో గణనీయమైన అసంతృప్తి నెలకొంటుందని అంటున్నారు.

వాస్తవానికి గత ఏడాది నవంబర్ లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు అమెరికన్లలో ఎలాన్ మస్క్ పై అనుకూలత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కు సలహాదారుగా మస్క్ వ్యవహరించడం బ్యాడ్ స్టేప్ అని 50 శాతానికి పైగా ప్రజలు అభిప్రాయపడుతుంటే.. 39% మంది అది మంచి ఆలోచన అని చెబుతున్నారంట.

అంటే... ఎలాన్ మస్క్ ను అమెరికా వ్యాపారాభివృద్ధిలో, అంతరిక్ష రంగంలో మరింత ముందుకు వెళ్లాలని మెజారిటీ అమెరికన్లు కోరుకుంటున్నారు తప్ప.. ఇలా డొనాల్డ్ ట్రంప్ కు సలహాదారుగానో, డొజ్ కు అధినేతగానో ఉండాలని కోరుకుంటున్నట్లు లేరని వాల్ స్ట్రీట్ జర్నల్ సర్వేలో పరోక్షంగానో ప్రత్యక్షంగానో వెళ్లైడనట్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) బాధ్యతలకు ఎలాన్ మస్క్ ఏ క్షణమైనా రాజీనామా చేసే అవకాశం ఉండోచ్చు అనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు.

Tags:    

Similar News