ఔను! వచ్చే ఏడాది తాను సృష్టించబోయే భూకంపానికి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కేసీఆర్ ఇప్పుడే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందుకోసం ఆయన చెన్నై వెళుతున్నారు. ముఖ్యమంత్రి భూకంపం సృష్టించడం ఏంటి...అందుకు రంగం సిద్ధం చేసుకోవడం ఏంటి...అందుకోసం తమిళుల గడ్డకు వెళ్లడం ఏంటి అని అనుకోకండి. హైదరాబాద్ శివారులోని కొంపల్లిలో తెలంగాణ రాష్ట్రసమితి 17వ ప్లీనరీ సమావేశంలో ప్రారంభ, ముగింపు ఉపన్యాసాలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసరాన్ని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఏడు దశాబ్దాల బీజేపీ, కాంగ్రెస్‌ల అసమర్థ పాలన, నిష్క్రియాపరత్వంతో దేశం విసిగిపోయిందని కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ రెండు పార్టీల పరిపాలన వల్ల భారతదేశం డెబ్బై ఏళ్ల విలువైన సమయాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు ఈ రెండు పార్టీలపై మొహం మొత్తిపోయారని, ఒక ప్రత్యామ్నాయం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. దేశ రాజకీయాల్లో నూటికినూరుశాతం క్రియాశీల పాత్రను పోషిస్తామని స్పష్టంచేశారు. కేవలం ఆరేళ్ల నిర్ణీత కాల వ్యవధిలో దేశంలో 40 కోట్ల ఎకరాలకు నీళ్లిచ్చే పథకాన్ని ఫెడరల్ ఫ్రంట్ ప్రకటిస్తుందంటూ పేర్కొని రెండు జాతీయ పార్టీల్లో ప్రకంపనలు సృష్టించారు. తాను తెలంగాణను వదిలిపెట్టి పోనని, హైదరాబాద్ నుంచే జాతీయ రాజకీయాల్లో భూకంపం పుట్టిస్తానని, దేశరాజకీయాలను ప్రభావితం చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
శుక్రవారం చేసిన ఈ ప్రకటనకు ఫలితాన్ని అందించేందుకు ఆయన ఆదివారం పర్యటన పెట్టుకున్నారు. తన తదుపరి రాజకీయ లక్ష్యం అయిన ఫెడరల్ ఫ్రంట్‌కు మరింత జోష్ నింపేందుకు ఆయన చెన్నై వెళుతున్నారు. దేశంలో సమూల మార్పు కోసం జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనకు ప్రాంతాలకతీతంగా కేసీఆర్ మద్దతు పెరుగుతోంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై వివిధ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్న కేసీఆర్.. రేపు చెన్నైకి వెళ్లనున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా డీఎంకే పార్టీ నేత స్టాలిన్ తో రేపు సమావేశం అవుతున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రాంతీయ పార్టీల సమన్వయ కూటమిని ఏర్పాటు చేస్తామన్నారు. స్టాలిన్ తో జరిగే సమావేశంలో.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం.
కాగా, ఫ్రంట్‌ను ఆషామాషీగా ప్రకటించలేదని కేసీఆర్ తెలిపిన సంగతి తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా రాబోయే రోజుల్లో మరిన్ని పార్టీలతో సమావేశం అవుతానని ఆయన అన్నారు. మే 2న యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ వస్తున్నాడని తెలిపాడు. ఆయనతో కీలక సమావేశం కానున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ అఖిలేష్ భేటీ అయిన సంగతి తెలిసిందే.