క‌రోనా చైనా నుంచి కాదు.. ఆస్ట్రేలియా నుంచి వ‌చ్చిందిః డ‌బ్ల్యూహెచ్‌వో!

Update: 2021-02-12 10:30 GMT
క‌రోనా మ‌హ‌మ్మారి ఉద్భ‌వించి ఏడాది కాలం దాటింది. దానికి వంద శాతం వ్యాక్సిన్ క‌నుక్కోలేక‌పోవ‌డం ఒకెత్త‌యితే.. అస‌లు అది ఎక్క‌డ పుట్టిందో అనే విష‌యంలోనూ స్ప‌ష్ట‌త రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ వైర‌స్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి ప్ర‌పంచానికి వ్యాపించింద‌నే ప్ర‌చారం ఉన్న విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా చైనాలో ఆ ల్యాబ్ ను సంద‌ర్శించిన డ‌బ్ల్యూహెచ్ వో బృందం.. కొత్త ప్ర‌క‌ట‌న చేయ‌డం విశేషం.

చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి ఈ వైర‌స్ వ్యాపించే అవ‌కాశం లేనే లేద‌ని చెప్పింది ఆ టీమ్‌. చైనాలో పర్యటిస్తున్న డబ్ల్యూహెచ్‌‌‌‌‌‌‌‌వో టీమ్‌‌‌‌‌‌‌‌ లీడర్ పీట‌ర్ ఎంబరేక్ ఈ విష‌య‌మై మాట్లాడారు. వుహాన్‌‌‌‌‌‌‌‌ ల్యాబ్‌‌‌‌‌‌‌‌ నుంచి కరోనా వ్యాపించే అవకాశం చాలా తక్కువని చెప్ప‌డం గ‌మ‌నార్హం. చైనాలో వైర‌స్ పుట్టింద‌నే దిశ‌గా ఇక‌పై పరిశోధనలు కూడా ఉండబోవని స్పష్టం చేశారు.

కొవిడ్ - 19 వైరస్‌‌‌‌‌‌‌‌ చైనాలో పుట్టలేదని, వేరే దేశం నుంచి తమ దేశానికి వచ్చింద‌ని చాలాకాలంగా చైనా వాదిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా అదే విషయాన్ని డబ్ల్యూహెచ్‌‌‌‌‌‌‌‌వో కూడా చెప్పింది. అయితే.. ఆస్ట్రేలియా బీఫ్‌‌‌‌‌‌‌‌ లాంటి ఉత్పత్తుల నుంచి వైరస్‌‌‌‌‌ పుట్టి ఉండొచ్చని చెప్పింది డబ్ల్యూహెచ్ వో బృందం! అయితే.. దీనిపై పరిశోధన చేయాల్సిన అవ‌స‌రం ఉందని తెలిపింది.

కాగా.. బ్రిటన్‌‌‌‌‌‌‌‌లోని కెంట్‌‌‌‌‌‌‌‌లో కనుగొన్న కరోనా వేరియంట్ అత్యంత ప్రమాదకరమని కొవిడ్‌-‌‌‌‌‌‌‌ 19 జీనోమిక్స్‌‌‌‌‌‌‌‌ యూకే కన్సార్షియం డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ షారోన్‌‌‌‌‌‌‌‌ పీకాక్‌‌‌‌‌‌‌‌ హెచ్చరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న‌ కొవిడ్‌‌‌‌‌‌‌‌ వ్యాక్సిన్లకు ఇది లొంగకుండా త‌యార‌య్యే అవకాశం కూడా ఉందన్నారు. ప్ర‌స్తుతం బ్రిటన్‌‌‌‌‌‌‌‌లో బ‌లంగా ఉన్న ఈ ర‌కం.. త్వ‌ర‌లో ప్రపంచమంతా వ్యాపించే అవ‌కాశం కూడా ఉంద‌న్నారు.
Tags:    

Similar News