దేశంలో కరోనా సెకండ్ వేవ్.. నగరాల్లో కర్ఫ్యూలు

Update: 2020-11-23 02:30 GMT
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ మొదలైనట్టే తెలుస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు అలెర్ట్ అయ్యాయి. ఢిల్లీ లాంటి రాష్ట్రాలు కరోనా నిబంధనలు టైట్ చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా కొత్త లాక్ డౌన్ గైడ్ లైన్స్ అమలులోకి వచ్చాయి.

ఆయా ప్రదేశాల్లో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూలు, సెక్షన్ 144ను మళ్లీ అమలు చేయడం ప్రారంభించాయి. అన్ లాక్ ప్రక్రియ మొదలైన ఇన్నిరోజుల తర్వాత మళ్లీ రాష్ట్రాల్లో కొత్త కోవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ప్రతిరోజు పాజిటివ్ ల సంఖ్య , మరణాల సంఖ్య పెరుగుతోంది. కోవిడ్ నిబంధనలు పాటించకపోతే ఢిల్లీలో 2వేలు భారీ జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీలో పెళ్లిళ్లకు కేవలం 50 మంది మాత్రమే హాజరు కావాలని తెలిపింది.

అలాగే అహ్మదాబాద్, ఇండోర్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాలు, నగరాల్లో నైట్ కర్ఫ్యూను విధించారు. మహారాష్ట్రలో అయితే అన్ని పాఠశాలలను ఈ సంవత్సరం పూర్తిగా మూసివేస్తున్నట్టు మహారాష్ట్ర సర్కార్ ప్రకటించింది.
Tags:    

Similar News