మనదేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. అయితే , గతంతో పోల్చితే , గత కొన్ని రోజులుగా నమోదు అయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా వస్తున్నాయి. దీనితో దేశంలో కరోనా మహమ్మారి కట్టడి కోసం పలు రాష్ట్రాలు విధించిన లాక్ డౌన్లు, కర్ఫ్యూలు, సడలింపులు ఫలించినట్టు తాజా కేసులను బట్టి చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా తాజా కేసుల సంఖ్య 1.5లక్షలకు దిగువన నమోదవుతుండటం ఊరట కలిగిస్తోంది. దేశంలో కొత్తగా గత 24 గంటల్లో 1,32,788 కేసులు నమోదయ్యాయి. అయితే జూన్ 1 తో పోల్చితే 1,27,510 కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఇక మరణాల సంఖ్య కూడా కాస్త పెరిగింది. జూన్ 1న 2,795 మరణాలు సంభవిస్తే.. తాజాగా ఆ సంఖ్య 3,207కి చేరింది.
ఇకపోతే , తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 2,83,07,832కు చేరింది. మొత్తంం మృతి చెందిన వారి సంఖ్య 3,35,102కు చేరింది. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కేసుల సంఖ్య కంటే, రికవరీలు అధికంగా ఉండటం ఊరటనిచ్చే అంశం. తాజాగా 2,31,456 మంది వ్యాధి బారినుంచి కోలుకోగా, ఇప్పటి వరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 2,61,79,085కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 92.48 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 17,93,645 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మంగళవారం ఒక్కరోజే 20,19,773 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీనితో మొత్తం పరీక్షల సంఖ్య 35,00,57,330కి చేరిందని, ఒక్కరోజే 23,97,191 వ్యాక్సిన్ డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 21,85,46,667కు చేరినట్లు చెప్పింది. యాక్టివ్ కేసులు కూడా 20 లక్షల కంటే దిగువనే ఉన్నాయి. 24 గంటల్లో అవి 1,01,875 తగ్గాయి. వరుసగా 20వ రోజు కొత్త కేసుల కంటే రికవరీ కేసులు ఎక్కువగా వచ్చాయి. అలాగే వీక్లీ పాజిటివిటీ రేటు 8.21 శాతంగా ఉంది. ఇది 5 శాతం కంటే తగ్గాల్సి ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 6.57 శాతంగా ఉంది. గత 9 రోజులుగా ఇది 10 శాతం కంటే తక్కువే ఉంటోంది