తెలంగాణలో 69% మందికి లక్షణాలు లేకుండానే పాజిటివ్ !

Update: 2020-09-01 08:30 GMT
కరోనా మహమ్మారి ..ఎవరిపై ఎటువైపు నుండి దాడి చేస్తుందో ఎవ్వరం చెప్పలేని పరిస్థితి. అసలు కరోనా సోకిన వ్యక్తిని కూడా గుర్తించడానికి కొన్ని కొన్ని సార్లు కష్టం అవుతుంది. కొందరిలో కరోనా లక్షణాలు త్వరగానే బయటపడితే ..మరికొందరిలో కేవలం కరోనా నిర్దారణ పరీక్షల్లో మాత్రమే కరోనా ఉన్నట్టు తేలుతుంది. అలాగే రోజుకో లక్షణం వెలుగులోకి వస్తుండటంతో అందరిలో ఆందోళన పెరిగిపోతుంది. ఇక ఈ మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్ కోసం చాలా దేశాల నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇకపోతే ,తెలంగాణలో కూడా రోజురోజుకి కరోనా మరింత పుంజుకుంటుంది అని తెలుస్తుంది.

తెలంగాణ లో చాలామంది కరోనా వైరస్  లక్షణాలు లేకుండానే కరోనా బారినపడుతున్నారని వెల్లడైంది.  రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటివరకు వచ్చిన కేసులను  పరిగణలోకి తీసుకోని ..  మొత్తం కేసుల్లో 69 శాతం మంది లక్షణాలు లేకుండానే కరోనా బారినపడినట్టు తేల్చారు. ఇక 31 శాతం మందికే కరోనా లక్షణాలు బయటపడ్డాయని తేల్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,24,963 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అందులో 86,225 మందికి లక్షణాల్లేవని వెల్లడించారు. ఇక 38,738 మందిలో కరోనా లక్షణాలు కనిపించాయి. ఈ  కేసుల కారణంగానే ఇతరులకు పెద్దసంఖ్యలో వైరస్‌ సోకుతోంది. ఈ కారణంగానే అనేక కుటుంబాల్లో 15 నుంచి 20 మందికి కూడా కరోనా సోకినట్లు అధికారులు చెప్తున్నారు.

కాంటాక్ట్‌ ట్రేసింగ్‌లో వైద్య ఆరోగ్యశాఖ ముందంజలో ఉంది. ఆదివారం 37,791 శాంపిళ్లను సేకరించగా, వాటిలో ప్రాథమిక, రెండో కాంటాక్ట్‌ ద్వారా అనుమానిత లక్షణాలతో పరీక్ష చేయించుకున్న వారు 59 శాతం మంది ఉన్నారు. మిగిలిన 41 శాతం మంది డైరెక్ట్‌ బాధితులు. అంటే ఈ బాధితుల ద్వారా ప్రాథమిక కాంటాక్టు అనుమానంతో 17,006 (45%) మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ ప్రాథమిక కాంటాక్టుల నుంచి రెండో కాంటాక్టు అయిన వారిలో 5,290 (14%) మందికి పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా జిల్లాల్లో ట్రేసింగ్‌ ప్రక్రియ పకడ్బందీగా సాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక, సెకండరీ కాంటాక్టులను వెంటనే గుర్తించడం వల్ల వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతోంది అని చెప్తున్నారు. లక్షణాల్లేకుండా ఎక్కువ మంది కరోనా బారినపడటం, వారి ద్వారా వైరస్‌ సోకిన ప్రాథమిక, సెకండరీ కాంటాక్టులను పరీక్షల ద్వారా గుర్తించి తక్షణ వైద్యం చేయడం వల్ల చాలామంది కరోనా నుంచి వేగంగా కోలుకుంటున్నారు. వీరిని ఇళ్లలోనే ఉంచుతూ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,299 యాక్టివ్‌ కేసులుంటే, 24,216 మంది ఇళ్లు లేదా వివిధ సంస్థల ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.మొత్తంగా తెలంగాణలో కరోనా బారినపడిన వారిలో 31 శాతం మందిలో మాత్రమే కరోనా లక్షణాలు ఉన్నాయని, 69 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా బారినపడినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది .
Tags:    

Similar News