అధికారికంగా వెలువడే బులిటెన్లు.. కరోనా పాజిటివ్ లెక్కల్ని కాసేపు పక్కన పెట్టేసి.. వాస్తవంగా ఏం జరుగుతోంది? క్షేత్రస్థాయిలో కొత్తకేసుల మాటేమిటి? అన్న ప్రశ్న ఇప్పుడు పలువురిని వెంటాడుతోంది. కరోనా సెకండ్ వేవ్ షురూ అయ్యిందన్న మాట ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే.. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కేరళ.. మహారాష్ట్రలతో పాటు కర్ణాటక.. తమిళనాడు.. మధ్యప్రదేశ్.. ఇలా పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది.
ఇలాంటివేళ..తెలుగు రాష్ట్రాలకు కీలకమైన హైదరాబాద్ మహా నగర పరిస్థితేమిటి? కరోనా కేసులు ఎలా నమోదవుతున్నాయి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. ఆసక్తికర సమాధానం వస్తోంది. హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారం క్రితం ఒకటి రెండుగా నమోదయ్యే కరోనా కేసులు.. గడిచిన వారంలో మాత్రం అందుకు భిన్నంగా కేసులు నమోదవుతున్నాయి. ఉదాహరణకు ప్రక్రతి చికిత్సాలయంలో వారం క్రితం వరకు కరోనా పరీక్షల్లో ఒకట్రెండు పాజిటివ్ కేసులు వచ్చేవి. వారం నుంచి 22-35 మధ్య పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇలాంటి పరిస్థితే చాలా ఆసుపత్రుల్లో ఉందని చెబుతున్నారు. అంతేకాదు.. ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా కరోనా కేసులు గడిచిన వారంలో పెరుగుతున్నట్లుగా గుర్తించారు. పాత కరోనా వైరస్ ఒకరి నుంచి పది మందికి వస్తే.. కొత్త స్ట్రెయిన్ మాత్రం ఒకరి నుంచి వందమందికి విస్తరించే లక్షణం ఉందంటున్నారు. గడిచిన మూడువారాల సరాసరులు తీసుకుంటే.. గడిచిన వారంలో మాత్రం పాజిటివ్ కేసులసంఖ్య పెరుగుతుందన్న విషయాన్ని కార్పొరేట్ ఆసుపత్రులు సైతం అంగీకరిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. కరోనా ఏముందన్న అలక్ష్యం మాత్రం ఇబ్బందేనని చెప్పక తప్పదు. జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి.