హైదరాబాద్ లో కరోనా విజృంభించింది. ఓ హాస్టల్లోని 45 మంది, మరో కాలేజీలో 30 మంది కరోనా బారిన పడ్డారు. బోయిన్ పల్లిలోని ఎస్సీఎస్టీ హాస్టల్ లో ఉంటున్న 40 మంది విద్యార్థులకు, ఐదుగురు సిబ్బందికి కలిపి మొత్తం 45 మందికి కొవిడ్ సోకింది.
ఈ హాస్టల్లో వంద మందికిపై విద్యార్థులు ఉంటూ.. వివిధ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. వీరిలో పలువురు దగ్గు, జ్వరంతో బాధపడడంతో వెంటనే పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మొత్తం 40 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. మరో ఐదుగురు సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు. నెగెటివ్ వచ్చిన విద్యార్థులను ఇళ్లకు పంపించారు.
ఇక హయత్ నగర్‌లోని పాఠశాలతోపాటు కాలేజీలో చదువుతున్న విద్యార్థుల్లో 30 మందికి కొవిడ్ సోకింది. ఇంకా కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. ఈ రెండు చోట్లనే కాకుండా.. పలు మండలాల్లోని హాస్టళ్లలోనూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
అయితే.. ఇప్పుడు అధికారులను మరో ఆందోళన కలవరానికి గురిచేస్తోంది. హాస్టల్లో 40 మందికి, కాలేజీలో 30 మందికి పాజిటివ్ వచ్చిందంటే.. వీరు కలిసి తిరిగిన వారి పరిస్థితి ఏంటన్నది ఊహించలేకపోతున్నారు. అసలు ఎవరితో వీరు గడిపిఉంటారు? వాళ్లలో ఎంత మందికి వ్యాపించి ఉంటుందన్నది అంతు చిక్కకుండా ఉంది.