బీజేపీని దోషిగా చూపి ప్రజలను మాయ చేసే ప్రయత్నంలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబుకు ఆయన అనుకున్నంత సులభమైన పరిస్థితులేమీ కనిపించడం లేదు. ఆయన బీజేపీని బోనులో నిలబెడుతుండగా - ఆయన్ను బోనులో నిలబెట్టేవారు కూడా తయారయ్యారు. ముఖ్యంగా ఇంతకాలం చంద్రబాబు తానా అంటే తందాన అన్న పవన్ కల్యాణ్ కూడా మెల్లమెల్లగా గొంతు మారుస్తున్నారు. మరోవైపు కొన్నాళ్లపాటు చంద్రబాబుకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ముద్రగడ పద్మనాభం మధ్యలో కొద్ది నెలలు శాంతించినా ఇప్పుడుమళ్లీ ఉద్యమానికి రెడీ అవుతున్నారు. దీంతో చంద్రబాబుకు మళ్లీ కష్టాలు మొదలైనట్లే కనిపిస్తున్నాయి.
కాపులకిచ్చిన హామీని మార్చి 31లోపు అమలు చేయాలని - లేదంటే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తేల్చి చెప్పారు. కాపుల బాధలను ముఖ్యమంత్రి చంద్రబాబు పెడచెవిన పెట్టారని ముద్రగడ ఆరోపించారు. ఈ కారణంగానే కాపులు రోడ్డెక్కవలసి వచ్చిందన్నారు. కాపు ఉద్యమం చేస్తున్నందుకు తాను, తన కుటుంబం ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నామన్నారు. తననే కాదు.. ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపులను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. ఎన్నికలవేళ కాపులకు ఇచ్చిన హామీలను.. అధికారంలోకి వచ్చాక విస్మరించడం న్యాయమా? అని ప్రశ్నించారు. రిజర్వేషన్ ఐదు శాతం కాకుండా హామీ ఇచ్చినట్లు పది నుంచి పన్నెండు శాతం ఇవ్వాలని ముద్రగడ డిమాండ్ చేశారు.
మరోవైపు పవన్ కూడా చంద్రబాబుకు డెడ్ లైన్ విధించారు. నిధులు వివరాలు ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 15 వరకు డెడ్‌లైన్ ఇస్తున్నట్టు ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆ తేదీలోగా తనకు నివేదికలు ఇవ్వాలని కోరారు. మిత్రపక్షంగా బీజేపీ - టీడీపీలు తనను గౌరవిస్తారనుకుంటున్నానని.. ఆ లోగా నివేదికలు ఇస్తారని భావిస్తున్నానని అన్నారు. ఒకవేళ ఇవ్వకపోతే.. అప్పుడేం చేయాలో నిర్ణయించి ముందుకెళతామన్నారు.
ఇద్దరిలో ముద్రగడ సంగతి తెలిసిందే. డెడ్ లైన్ పెట్టాక ఆయన ఎలా రియాక్టవుతారో గతంలో ఎన్నోసార్లు రుజువైంది. ఆయన ఉద్యమం మొదలుపెడితే రాష్ట్రంలో సమీకరణాలు ఎలా మారుతాయో కూడా ఊహించొచ్చు. అదేసమయంలో పవన్ కూడా ఇంత ఓపెన్ గా డెడ్ లైన్ ప్రకటించడంతో, దానికి టీడీపీ స్పందించకపోతే ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుముందు చంద్రబాబుకు కష్టాలు తప్పేలా లేవు.